Kalki 7 Days Collections కల్కి మరో సంచలనం.. బాహుబలి రికార్డు బ్రేక్.. ఏడో రోజు ఎన్ని కోట్లంటే?
కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రవాహం కొనసాగుతున్నది. వర్కింగ్ డే రోజున కలెక్షన్లు పడిపోతాయనే వాదనకు ఈ సినిమాకు గట్టిగా సమాధానం చెబుతున్నది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా రిలీజైన ప్రతీ చోట వర్కింగ్ డే రోజున కూడా నిలకడగా వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాలను విస్మయం కలిగించింది. ఈ సినిమా 7వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
కల్కి గత 6 రోజుల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రికార్డులు తిరగ రాసింది. తెలుగులో 200 కోట్ల రూపాయలు, తమిళంలో 21 కోట్ల రూపాయలు, హిందీలో 145 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 35 కోట్ల రూపాయలు, కేరళలో 13 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఈ చిత్రం 415 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక 7వ రోజు ఈ సినిమా స్ట్రాంగ్‌గా కలెక్షన్లు వసూలు చేసింది. తెలుగులో 10 కోట్ల రూపాయలు, తమిళంలో కోటి రూపాయలు, హిందీలో 11 కోట్లు, కర్ణాటకలో 2 కోట్ల రూపాయలు, మలయాళంలో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 25 కోట్ల రూపాయలు ఇండియాలో వసూలు చేసింది.
ఇక ఈ సినిమా ఓవర్సీస్‌లో కూడా ఇప్పటి వరకు భారీ వసూళ్లను సాధించింది. నార్త్ అమెరికా, యూకే, ఇతర దేశాల్లో మరో 10 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం ఇప్పటికే 125 కోట్లు వసూలు చేసింది. 7వ రోజుతో ఈ సినిమా 160 కోట్ల రూపాయలు కలెక్షన్లు నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

కల్కి చిత్రం కేవలం 5 రోజుల్లోనే 625 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 6వ రోజు సాధించిన 40 కోట్ల రూపాయల కలెక్షన్ల కలిపితే ఈ మూవీ 665 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తాజాగా 7వ రోజు 35 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది కాబట్టి.. ఈ సినిమా 700 కోట్ల మార్కును దాటే అవకాశం ఉంది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే బాహుబలి1, జైలర్, లియో సినిమాల కలెక్షన్లు క్రాస్ చేసింది.


Click it and Unblock the Notifications











