Kalki 9 Days Collections 800 కోట్ల క్లబ్‌లో కల్కి.. హిస్టరీ క్రియేట్ చేసిన ప్రభాస్ మూవీ.. 9వ రోజు ఎన్ని కోట్లం
ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం వైపు దూసుకెళ్తున్న కల్కి 2898 ఏడీ విడుదలైన ప్రతీ చోట కలెక్షన్ల వరద పారిస్తున్నది. ఈ సినిమా 9వ రోజు కూడా భారీ వసూళ్లును నమోదు చేయడం ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ స్పష్టంగా తెలియజేస్తున్నది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ నిర్మాణంలో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం 9వ రోజు ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
కల్కి చిత్రం ఇండియాలో రికార్డు వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ మూవీ తొలివారం ముగిసే సమయానికి తెలుగులో 212 కోట్ల రూపాయలు, తమిళంలో 23 కోట్ల రూపాయలు, హిందీలో 163 కోట్ల రూపాయలు, మలయాళంలో 15 కోట్ల రూపాయలు, కన్నడలో 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఫస్ట్ వీక్‌లో 450 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది.

ఇక ప్రభాస్ నటించిన ఈ సెన్సేషనల్ మూవీ విషయానికి వస్తే.. 9వ రోజు కూడా నిలకడగా వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో 6 కోట్ల రూపాయలు, తమిళంలో 1 కోటి రూపాయలు, హిందీలో 10 కోట్ల రూపాయలు, మలయాళంలో 1 కోటి రూపాయలు, కన్నడలో 2 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
దాంతో 9వ రోజు ఇండియాలో 20 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని తెలిపారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉందని తెలిపారు. దాంతో ఈ సినిమా 760 కోట్ల రూపాయలు రాబడుతుందని, ఇక శుక్రవారం ఈ సినిమా 800 కోట్ల వసూళ్లను దాటుతుందని వెల్లడించారు.
ఇక గత 9 రోజుల్లో కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు జోన్‌లో కొనసాగుతున్నది. ఇండియాలో 470 కోట్ల నికరంగా రూపాయలు 510 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా విషయానికి వస్తే.. నార్త్ అమెరికాలో 15 మిలియన్ డాలర్లు అంటే.. 120 కోట్లు, ఇతర దేశాల్లో కలిపి 30 మిలియన్ డాలర్లు అంటే.. 250 కోట్లరూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా 9 రోజుల్లో 760 కోట్లు రాబట్టింది.


Click it and Unblock the Notifications











