Kalki Overseas Collections: హాలీవుడ్ సినిమాలకు ధీటుగా కల్కి.. మహేష్ రికార్డును ప్రభాస్ బ్రేక్!

కల్కి చిత్రం భారీ వసూళ్లతో రికార్డులు క్రియేట్ చేస్తున్నది. ఈ సినిమా తెలుగు, ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్‌లో కలెక్షన్ల కుంభవృష్టిని కురిపిస్తున్నది. మూడో వారంలో కూడా ఇండియన్ సినిమాలే కాకుండా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా కాసులను రాబడుతున్నది. ఈ సినిమా గత మూడు వారాల్లో ఎంత వసూలు చేసింది. 18వ రోజు తర్వాత కూడా ప్రభాస్ మూవీ ఎలాంటి కలెక్షన్లను రాబడుతున్నదనే విషయంలోకి వెళితే..

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2828 ఏడీ సినిమా నార్త్ అమెరికాలో సంచలనం క్రియేట్ చేస్తున్నది. ఈ సినిమా 18 మిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించి.. 19 మిలియన్ల కలెక్షన్లను నమోదు చేసేందుకు రెడీ అవుతున్నది. ఇక అమెరికేతర దేశాల్లో ఈ సినిమా ఘనంగా వసూళ్లను రాబడుతున్నది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 30 మిలియన్ డాలర్లు వసూలు చేసిందని ట్రేడ్ వ్గాలు వెల్లడిస్తున్నాయి.

Kalki 2898 AD Movie 18 days Overseas Collections in North America UK

నార్త్ అమెరికాలో అంటే.. యూఎస్, కెనడాలో కల్కి చిత్రం ప్రభంజనం కొనసాగిస్తున్నది. ప్రస్తుతం అక్కడ డిస్పికేబుల్ మీ 4 ( Despicable Me 4), ఇన్‌సైడ్ అవుట్ 2 (Insideout 2), క్వయిట్ ప్లేస్ (Quiet Place), బ్యాడ్ బాయ్స్ (Bad Boys) చిత్రాలు భారీగా కలెక్షన్లను రాబడుతున్నాయి. అయితే హలీవుడ్ సినిమాలతో పోటీ పడుతూ కల్కి చిత్రం భారీ వసూళ్లను రాబడుతున్నది.

ఇక ఇండియన్ సినిమాలకు కల్కి చిత్రం భారీ పోటీగా మారింది. ఈ సినిమా తాజాగా రిలీజైన తెలుగు, హిందీ, తమిళ సినిమాలను మించి వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా 18వ రోజున కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2, అక్షయ్ కుమార్ తాజా చిత్రం సర్ఫీరా, తెలుగు చిత్రం భారతీయుడు 2, హిందీ వెర్షన్ హిందుస్తానీ 2 కంటే ఎక్కువగా కలెక్షన్లు రాబట్టింది.

Kalki 2898 AD Movie 18 days Overseas Collections in North America UK

కల్కి చిత్రం 18వ రోజున రికార్డు స్థాయిలో టికెట్లను అమ్ముడం జరిగింది. అమెరికాలో గుంటూరు కారం సినిమా తొలి రోజు కలెక్షన్ల కంటే కల్కి 18వ రోజు కలెక్షన్లు అధికంగా ఉండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఓవర్సీస్‌లో ఇండియన్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా
రికార్డును సొంతం చేసుకొనేందుకు సిద్దమైంది.

కల్కి సినిమా ప్రభంజనంతో ప్రభాస్ బాక్సాఫీస్ సత్తా మరోసారి రుజువైంది. ఈ సినిమాతో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోగా ప్రభాస్ రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు. ఇప్పటికే బాహుబలి 2తో టాప్ గ్రాసర్‌ సాధించిన హీరోగా, కల్కితో మరోసారి నార్త్ అమెరికాను శాసించిన స్టార్‌గా తన సత్తాను చాటుకొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X