Kalki 2898 AD 45 Days Collection: కల్కి మరో సంచలనం.. సూపర్ స్టార్ రికార్డు ఔట్.. వందల కోట్లతో ఊచకోత

గతంలో కంటే ఇప్పుడు టాలీవుడ్‌కు చెందిన హీరోలే పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్‌లను అందుకుంటూ దూసుకుపోతోన్నారు. ఫలితంగా రికార్డులు క్రియేట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. అలాంటి వారిలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు.

ఈ మధ్య కాలంలో తనదైన చిత్రాలతో సత్తా చాటుతోన్న అతడు.. గత నెలలోనే 'కల్కి 2898 ఏడీ' అనే సినిమాతో వచ్చాడు. ఈ మూవీకి ఆరంభం నుంచీ భారీ స్థాయిలో స్పందన లభిస్తూనే ఉంది. ఫలితంగా ఈ సినిమా రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'కల్కి 2898 ఏడీ' 45 రోజుల వసూళ్లపై మీరే ఓ లుక్కేయండి మరి!

Kalki 2898 AD Movie 45 Days Worldwide Box Office Collections Prabhas Film Crossed Jawan Movie Collections

కల్కిగా ప్రభాస్ విశ్వరూపం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన టెక్నికల్ వండర్ మూవీనే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ భారీ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రలు చేశారు.

Kalki 2898 AD Movie 45 Days Worldwide Box Office Collections Prabhas Film Crossed Jawan Movie Collections

ప్రభాస్ బిజినెస్ ఎంతంటే

ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ'కి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి రూ. 370 కోట్లు బిజినెస్ జరిగింది.

Kalki 2898 AD Movie 45 Days Worldwide Box Office Collections Prabhas Film Crossed Jawan Movie Collections

45వ రోజు తెలుగు కలెక్షన్లు
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి నెల రోజులు దాటినా ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం భారీగానే లభిస్తోంది. 45వ రోజు ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రేక్షకుల రెస్పాన్స్ కాసింత పెరిగింది. ఫలితంగా ఈ చిత్రం శనివారం రూ. 15 లక్షలు షేర్‌తో పాటు రూ. 25 లక్షలు గ్రాస్ రాబట్టింది.

45 రోజుల్లో తెలుగు కలెక్షన్లు

'కల్కి 2898 ఏడీ' 45 రోజుల్లో తెలుగులో భారీ వసూళ్లు రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 92.64 కోట్లు, సీడెడ్‌లో రూ. 21.73 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 21.71 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 12.45 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 9.57 కోట్లు, గుంటూరులో రూ. 11.29 కోట్లు, కృష్ణాలో రూ. 11.28 కోట్లు, నెల్లూరులో రూ. 6.18 కోట్లతో.. రూ. 186.85 కోట్లు షేర్, రూ. 295.30 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Kalki 2898 AD Movie 45 Days Worldwide Box Office Collections Prabhas Film Crossed Jawan Movie Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుతోంది. దీనికి 45 రోజుల్లో తెలుగులో రూ. 186.85 కోట్లు, తమిళంలో రూ. 21.90 కోట్లు, కర్నాటకలో రూ. 36.50 కోట్లు, కేరళలో రూ. 13.00 కోట్లు, హిందీలో రూ. 149.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 130.50 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 537.75 కోట్లు షేర్, రూ. 1122 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. లాభమెంత

'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 370 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 372 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది 45 రోజుల్లో దీనికి రూ. 537.75 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 165.75 కోట్లు లాభాలతో రికార్డులు బద్దలు కొట్టేసింది.

Kalki 2898 AD Movie 45 Days Worldwide Box Office Collections Prabhas Film Crossed Jawan Movie Collections

జవాన్ ఔట్.. 4వ స్థానంలో
ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా వరల్డ్ వైడ్‌గా అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఇలా ఇప్పటి వరకూ ఈ చిత్రం ఇండియాలో రూ. 643 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. తద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో 'జవాన్'ను దాటేసి నాలుగో స్థానానికి చేరింది. ఈ లిస్టులో బాహుబలి 2, కేజీఎఫ్ 2, RRR దీనికంటే ముందున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X