Kalki 2898 AD: మరో చరిత్ర సృష్టించిన ప్రభాస్.. RRR, యానిమల్, జవాన్ రికార్డులు గల్లంతు
సాధారణంగా ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీల నుంచి ప్రతి వారం సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే దేశ వ్యాప్తంగా బజ్‌ను ఏర్పరచుకుంటాయి. అలాంటి చిత్రాల్లో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ' ఒకటి. అత్యంత భారీ బడ్జెట్‌తో టెక్నికల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో గత వారంలోనే విడుదలైంది. దీనికి భారీ రెస్పాన్స్ వస్తుండడంతో వసూళ్లు కూడా పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 'కల్కి 2898 ఏడీ' నార్త్ అమెరికాలో రికార్డులు బ్రేక్ చేసింది. ఆ వివరాలు మీకోసమే!
కల్కి అంటూ వచ్చాడు
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రమే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలకమైన పాత్రలు చేశారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.

850 కోట్లు దాటేసింది
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాను ఎన్నో అంచనాల నడుమ భారీ స్థాయిలో విడుదల చేశారు. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా రెస్పాన్స్ కూడా అదిరిపోయేలా అందుకుంటోంది. దీంతో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఇలా ఇప్పటికే రూ. 850 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

యూఎస్‌లో భారీగానే
అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి విడుదలకు ముందు నుంచే నార్త్ అమెరికాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఫలితంగా అక్కడ ప్రీమియర్స్‌కే ఈ చిత్రం రికార్డు వసూళ్లను సాధించింది. ఆ తర్వాత కూడా ఇది రోజుకు కనీసం హాఫ్ మిలియన్ డాలర్లను సాధిస్తోంది. ఇలా యూఎస్‌లో ప్రభాస్ సినిమా రికార్డల మీద రికార్డులు నమోదు చేసుకుంటోంది.

ఆ మైలురాయి దాటి
ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించి మిగిలిన అన్ని ప్రాంతాల కంటే యూఎస్‌లో ఎక్కువగా రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. దీంతో అక్కడ టికెట్ల అమ్మకాలు భారీగా సాగుతున్నాయి. ఇలా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా యూఎస్‌లో అప్పుడే 15.5 మిలియన్ డాలర్ల మార్కును కూడా చేరుకుంది.

ఆ రికార్డులన్నీ బ్రేక్
నాగ్ అశ్విన్ - రెబెల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమా నార్త్ అమెరికాలో పది రోజుల్లోనే 15.5 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. తద్వారా వేగంగా ఈ మైలురాయిని చేరుకోవడంతో పాటు RRR (14.2), యానిమల్ (15), జవాన్ (15.23) రికార్డులను బ్రేక్ చేసింది. అలాగే, అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో 3వ ప్లేస్‌కు చేరింది.


Click it and Unblock the Notifications











