Kalki 2898 AD రికార్డులు తిరగరాస్తున్న కల్కి అడ్వాన్స్ బుకింగ్‌.. రిలీజ్‌కు ముందే ఓవర్సీస్‌లో వసూళ్ల సునామీ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) చిత్రం రిలీజ్‌కు బాక్సాఫీస్ ల్యాండ్ మార్క్ సెట్ చేస్తున్నది. అడ్వాన్స్ బుకింగ్ మొదలైన వెంటనే హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. దాంతో ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్ సాధించడానికి సిద్దమైంది. ఓవర్సీస్‌లో కల్కి సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

విదేశాల్లో ఏ తెలుగు సినిమా వసూలు చేయని విధంగా కల్కి 2898 ఏడీ చిత్రం భారీగా వసూళ్లను రాబడుతున్నది. జర్మనీ లాంటి దేశంలో భారీ కలెక్షన్లు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఈ దేశంలో 64K యూరోల కలెక్షన్లు రాబట్టింది. ఇది ఓ తెలుగు సినిమా జర్మనీలో సాధించిన రికార్డుగా ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

Kalki 2898 AD Movie Overseas Pre Sales booking Worldwide

ఇదిలా ఉంటే.. యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, న్యూజిలాండ్, దుబాయ్, గల్ప్ ప్రాంతాల్లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నాయి. ఏ రేంజ్‌లో కలెక్షన్లు ఉన్నాయనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు త్వరలోనే వెల్లడించనున్నాయి. అయితే ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించే చిత్రాల్లో ఒకటిగా ఉంటుందని చెబుతున్నారు.

ఉత్తర అమెరికా అంటే.. అమెరికా, కెనడాలో ప్రభాస్ నటించిన చిత్రం రికార్డులు తిరగరాస్తున్నది. ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా నమోదు చేయని విధంగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇంకా రెండు రోజులు ఉండగానే ఈ సినిమా 125K టికెట్లను అమ్మడం జరిగింది. దాంతో ఈ సినిమాపై ఓవర్సీస్‌లో ఎంత క్రేజ్ ఉందో స్పష్టమైంది.

Kalki 2898 AD Movie Overseas Pre Sales booking Worldwide

ఇక నార్త్ అమెరికాలో కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) కలెక్షన్ల పరంగా సంచలనం రేపుతున్నది. ఈ చిత్రం ఇప్పటికే ప్రీ రిలీజ్ బుకింగ్ విషయంలో రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ కాకముందే 3 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 25 లక్షల రూపాయల వసూళ్లను రాబట్టింది.

ఇక ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఈ సినిమాను రూపొందించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను 600 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తోపాటు దీపిక పదుకోన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు నటించారు. ఈ చిత్రం జూన్ 27వ తేదీన రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X