Kalki 2898 AD Overseas Collections: యూఎస్‌లో ఆల్ టైమ్ రికార్డు.. మహేష్, చెర్రీ, ఎన్టీఆర్ రికార్డులు ఫట్
కల్కి చిత్రం తొలి ఆట నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం తెలుగు గడ్డ మీదే కాకుండా ఈ సినిమా పరాయి గడ్డపై సునామీని మరిపించేలా కోట్ల రూపాయల వర్షాన్ని కురిపిస్తున్నది. ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
కల్కి సినిమాను ఖర్చులకు వెనుకాడకుండా ఇండియన్ సినిమా రంగంలో ఎన్నడూ లేని విధంగా అత్యాధునిక సాంకేతికతో సుమారుగా 600 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాకు బజ్ భారీగా ఉండటంతో ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయాయి.

ఓవర్సీస్ రైట్స్ 70 కోట్లకు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 385 కోట్లుగా నమోదు అయింది. ఈ సినిమా హక్కులు 70 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం ఓ రికార్డుగా చెప్పుకొన్నారు. అలాగే ఈ సినిమాను సుమారుగా 4500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
ఇదిలా ఉండగా, కల్కి మూవీని ప్రీమియర్స్‌కు రికార్డు కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ మూవీకి ప్రీమియర్ల ద్వారా ఉత్తర అమెరికా అంటే.. యూఎస్, కెనడాలో $3,859,967 డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 32.20 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. ఇది నార్త్ అమెరికాలో ఇది ఆల్ టైమ్ రికార్డుగా ట్రేడ్ వర్గాలు చెప్పాయి.
ఇక నార్త్ అమెరికాలో కల్కి రికార్డుల్లో మరో ఘనతను సాధించింది. ఈ సినిమా తొలి రోజున ఊహించని విధంగా కలెక్షన్లు రాబట్టింది. అమెరికా, కెనడాలో ఈ సినిమా ప్రీమియర్లు, తొలి రోజు కలిపి 4.5 మిలియన్ల డాలర్ల మార్కును దాటింది. అంటే భారతీయ కరెన్సీలో 37.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక యూకేలో కల్కి సినిమా బాక్సాఫీస్ కదం తొక్కుతున్నది. ఇంగ్లాండ్‌లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్ింది. ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా 236K వసూళ్లను రాబట్టింది. యూకేలో ఇటీవల గుంటూరు కారం సినిమా సాధించిన అత్యధిక వసూళ్లను అధిగమించింది.
ఇదిలా ఉండగా, జర్మీనీలో రికార్డు స్థాయిలో యూరోలను వసూలు చేసింది. గల్ఫ్, యూఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్‌లోని కొన్ని దేశాల్లో భారీ ఓపెనింగ్స్ సాధించాయి. ఇంకా ఈ దేశాల్లో కలెక్షన్ల వివరాలు అందాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











