అతిచిన్న దేశంలో కల్కి ఆల్ టైమ్ రికార్డు.. రణ్‌బీర్ కపూర్, షారుక్ రికార్డులు బ్రేక్

కల్కి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎదురే లేకుండా దూసుకుపోతున్నది. ప్రభాస్ నటించిన ఈ సినిమా రికార్డులు తిరగరాస్తూ భారీ కలెక్షన్లు రాబడుతున్నది. నాగ్ అశ్విన్ దర్వకత్వంలో వైజయంతీ మూవీస్ రూపొందించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమా చరిత్రలో మెరుగైన స్థానాన్ని సొంతం చేసుకోబోతున్నది. ఈ మూవీ ఓవర్సీస్‌లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

గత పది రోజులుగా ఓవర్సీస్‌లో ప్రభంజనం సృష్టిస్తున్నది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో అంటే.. కెనడా, అమెరికాలో రికార్డు వసూళ్లను రాబడుతున్నది. గత 10 రోజుల్లో ఈ సినిమా 15.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక 11వ రోజు ఈ సినిమా 1 మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Kalki 2898 AD recorded All time high Collections in Nigeria after Russia Srilanka Germany

ఇదిలా ఉండగా, అమెరికేతర దేశాల్లో కూడా కల్కి 2898 AD చిత్రం సంచలనం రేపతుున్నది. యూకే‌లో ఇప్పటికే 1.5 మిలియన్ పౌండ్స్ రాబట్టింది. రష్యా, శ్రీలంక, జర్మనీ దేశాల్లో ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసింది. దాంతో ఈ సినిమా బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించే చిత్రంగా మారబోతున్నదని తాజా ట్రెండ్ వెల్లడిస్తున్నది.

ఇక తాజాగా కల్కి కలెక్షన్ల సునామీలో నైజీరియా దేశం కూడా రికార్డులు తిరగరాసింది. ఈ సినిమా ఆ దేశంలో ఆల్ టైమ్ రికార్డును అందుకొన్నది. ఈ మూవీ గతంలో సందీప్ రెడ్డి వంగా, రణ్‌బీర్ సింగ్ నటించిన యానిమల్ సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. యానిమల్ కలెక్ట్ చేసిన 1 మిలియన్ నైజీరియన్ నైరాలు అంటే ఇండియా కరెన్సీలో 50 లక్షల రూపాయల కలెక్షన్లను బ్రేక్ చేసినట్టు సమాచారం.

Kalki 2898 AD recorded All time high Collections in Nigeria after Russia Srilanka Germany

ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల్లో 800 కోట్ల రూపాయలను వసూలు చేయగా.. 10వ రోజు 45 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 845 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక 11వ రోజు ఈ సినిమా సుమారుగా 60 నుంచి 70 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు. దాంతో ఈ సినిమా 900 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్కును అధిగమించనున్నది.

More from Filmibeat

Read more about: kalki 2898 ad nigeria prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X