శ్రీలంకలో కల్కి కలెక్షన్ల సునామీ.. రష్యాలో రఫ్ ఆడిస్తున్న ప్రభాస్.. కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?

కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ రికార్డులు తిరగరాస్తున్నది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా వైడ్‌గా సంచలన రీతిలో కలెక్షన్లు రాబడుతున్నది. ఇప్పటికే ఈ సినిమా 600 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం విదేశాల్లో చిన్న దేశాల్లో కూడా రికార్డు కలెక్షన్లను రాబడుతున్నది. ఆ దేశాల్లో ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

నార్త్ అమెరికాలో అంటే కెనడా, అమెరికా దేశాల్లో కల్కి సినిమా వసూళ్ల దుమారం క్రియేట్ చేస్తున్నది. ఎవరి అంచనాలకు అందని విధంగా కలెక్షన్లు రాబడుతున్నది. ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే 12 మిలియన్లు అంటే 110 కోట్ల రూపాయలు భారతీయ కరెన్సీలో రాబట్టింది. ఇంకా బలంగా బాక్సాఫీస్ వద్ద కనిపిస్తున్నది.

Kalki 2898 AD s Srilanka Russian box office Collections Prabhas movie creating Records at Overseas Market

ఇక కల్కి ఓవర్సీస్ కలెక్షన్ల విషయంలో ఆశ్చర్యకరంగా అనిపించేది ఏమిటంటే.. రష్యా, శ్రీలంక, జర్మనీ లాంటి దేశాల్లో కలెక్షన్ల కుంభవృష్టిని కురిపిస్తున్నది. దాంతో ప్రపంచవ్యాప్తంగా నిర్మాత సీ అశ్వినీదత్‌కు కాసుల పంట పండుతున్నది.

కల్కికి సినిమాకు రష్యాలో ఊహించని విధంగా కలెక్షన్లు రాబడుతున్నది. ఈ దేశంలో అమితాబ్, ప్రభాస్‌కు భారీ ఫాలోయింగ్ ఉండటంతో అనూహ్యమైన ఫలితాలను సాధిస్తున్నది. రష్యాలో ఈ సినిమా 1.24 మిలియన్ రష్యన్ రూబుల్స్ అంటే.. సుమారుగా 1 కోటి రూపాయలు రాబట్టడం రికార్డుగా మారింది.

ఇక శ్రీలంకలో కూడా కల్కికి కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తున్నది. తొలి రోజు 32 లక్షల శ్రీలంక రూపాయలు, రెండో రోజు 41 లక్షలు, మూడో రోజు 57 లక్షలు, నాలుగో రోజు 53 లక్షల రూపాయలు వసూలు చేసింది. గత నాలుగు రోజుల్లో 1.8 కోట్ల శ్రీలంక రూపాయలు వసూల చేసింది.

ఇక యూకేలో కూడా ప్రభాస్ మూవీ హవా కొనసాగుతున్నది. ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లు నమోదు చేస్తున్నది. యూకేలో 1 మిలియన్ పౌండ్స్ వసూలు చేసింది. అమెరికాలో 12 మిలియన్లతో కలిపి ఓవర్సీస్ మార్కెట్‌లో 18 మిలియన్ డాలర్ల కలెక్షన్లకు చేరువైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X