సమంత ని ఫైనల్ చేసారు, వచ్చే నెల లాంచింగ్
హైదరాబాద్ : కొన్ని కాంబినేషన్ లు ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. వాటిని చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతూంటారు. అలాంటి కాంబినేషన్ ...నాగచైతన్య, సమంత. వీరిద్దరూ నటించిన తొలి చిత్రం ఏమి మాయచేసావే. ఆ సినిమాతోనే సమంత లాంచ్ అయ్యింది.
ఆ సెంటిమెంట్ తోనే మరేమో కానీ తర్వాత వరసగా ఆటోనగర్ సూర్య, మనం చిత్రాలు చేసింది. ఇప్పుడు మరోసారి నాగచైతన్య సరసన చేయటానికి డేట్స్ ఇచ్చిందని సమాచారం. అంటే చైతూతో ఆమె కాంబినేషన్ నాలుగోసారి అన్నమాట. ఇంతకీ ఈ చిత్రం దర్శకుడు ఎవరూ అంటారా..కళ్యాణ్ కృష్ణ

నాగర్జునకు ఈ మధ్యకాలంలో సరైన హిట్స్ లేక భాదపడుతున్న సమయంలో సోగ్గాడే చిన్ని నాయినా ఆంటూ సుపర్ హిట్ చిత్రాన్ని అంధించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. సంక్రాంతికు పెద్ద హిట్టైన ఈ చిత్రం తో పరిచయమైన ఈ దర్శకుడుకి నెక్ట్స్ సినిమా అఖిల్ తో అనుకున్నారు. అయితే అనుకోని విధంగా నాగచైతన్య సీన్ లోకి వచ్చాడు.
అసలు కళ్యాణ్ కృష్ణ... నాగర్జున హీరోగా బంగార్రాజు అనే సినిమా చేస్తాడని కూడా వార్తలు వచ్చాయి. ఈ మేరకు టైటిల్ కూడా రిజిష్టర్ చేసారు. ఈ సినిమా సోగ్గాడుకు ఫ్రీక్విల్ అని కూడా అన్నారు. అయితే ముందు నా కొడుక్కు ఓ హిట్ ఇవ్వు అని నాగ్ పురమాయించినట్లున్నాడు.

తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాను ఏప్రిల్ 16న అఫిషియల్ గా లాంచ్ చేయనున్నారు. ఫన్ , యాక్షన్ తో కలిసిన సినిమా అంటున్నారు. ఓ కొత్త తరహా కథ అని చెప్తున్నారు. నాగ్ లాంటి సీనియర్ కే బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఖచ్చితంగా నాగచైతన్యని కూడా నిలబెట్టే సినిమా వస్తుంది ఏమంటారు.


Click it and Unblock the Notifications











