Amigos 1st Week Collections: కల్యాణ్ రామ్‌కు భారీ దెబ్బ.. వారంలోనే ఢమాల్.. అన్ని కోట్ల నష్టాల దిశగా!

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. కష్టపడేతత్వంతో పాటు విభిన్నమైన ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో ఫ్లాపులు వచ్చినా.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు అతడు 'అమిగోస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో దక్కట్లేదు. ఈ నేపథ్యంలో అమిగోస్ వారం రోజుల్లో రిపోర్టు మీకోసం!

అమిగోస్‌‌ అంటూ వచ్చిన హీరో

అమిగోస్‌‌ అంటూ వచ్చిన హీరో

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన సినిమానే 'అమిగోస్'. డాపుల్ గ్యాంగర్ అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు నిర్మించారు. దీనికి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు నటించారు.

అమిగోస్ ప్రీ బిజినెస్ డీటేల్స్

అమిగోస్ ప్రీ బిజినెస్ డీటేల్స్


కల్యాణ్ రామ్‌కు 'అమిగోస్' సినిమాకు ఊహించని విధంగా బిజినెస్ తక్కువే అయింది. దీంతో నైజాంలో రూ. 3.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.10 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 4.20 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.10 కోట్లకు అమ్ముడైంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.40 కోట్లతో కలిపి రూ. 11.30 కోట్ల బిజినెస్ అయింది.

ఏడో రోజు ఎంత రాబట్టింది?

ఏడో రోజు ఎంత రాబట్టింది?

టాలెంటెడ్ హీరో కల్యాణ్ రామ్ - అషికా రంగనాథ్ జోడీగా నటించిన 'అమిగోస్' చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దీనికి చాలా తక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆరో రోజు వసూళ్లు మరింతగా పడిపోయాయి. ఫలితంగా ఈ సినిమాకు 7వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కేవలం రూ. 11 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

వారం రోజులకు ఎంతొచ్చింది?

వారం రోజులకు ఎంతొచ్చింది?

వారం రోజులకు కలిపి 'అమిగోస్'కు వసూళ్లు తక్కువగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.51 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.00 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 66 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 47 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 29 లక్షలు, గుంటూరులో రూ. 59 లక్షలు, కృష్ణాలో రూ. 43 లక్షలు, నెల్లూరులో రూ. 25 లక్షలతో కలిపి.. రూ. 5.20 కోట్లు షేర్, రూ. 8.80 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే


ఏపీ, తెలంగాణలో పెద్దగా రాణించని కల్యాణ్ రామ్ 'అమిగోస్' మూవీకి 7 రోజుల్లో రూ. 5.20 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 32 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 71 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 7 రోజుల్లో ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 6.23 కోట్లు షేర్‌తో పాటు రూ. 11.00 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?


కల్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేసిన 'అమిగోస్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12.00 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి రూ. 6.23 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 5.77 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

అన్ని కోట్ల నష్టాలు తప్పవా

అన్ని కోట్ల నష్టాలు తప్పవా

నందమూరి కల్యాణ్ రామ్ - రాజేంద్ర రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన 'అమిగోస్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఆశించిన రీతిలో కలెక్షన్లు దక్కడం లేదు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశజనకంగా సాగుతోంది. ఇలా వారంలో కేవలం రూ. 6.23 కోట్లే రాబట్టింది. ఇదే కంటిన్యూ అయితే ఈ చిత్రానికి రూ. 5 కోట్లు వరకూ నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X