Amigos 2 Days Collections: భారీగా పడిపోయిన వసూళ్లు.. 2వ రోజే ఇంత తక్కువ.. అన్ని కోట్లు వస్తేనే హిట్

ఎప్పటికప్పుడు విభిన్నమైన చిత్రాలను చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకుని సత్తా చాటుతోన్నాడు నందమూరి కల్యాణ్ రామ్. కెరీర్ ఆరంభం నుంచీ పెద్దగా విజయాలను అందుకోని అతడు.. గత ఏడాది వచ్చిన 'బింబిసార'తో బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు కల్యాణ్ రామ్ 'అమిగోస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ఓ మోస్తరు స్పందనే దక్కుతోంది. ఈ నేపథ్యంలో అమిగోస్ రెండు రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూసేయండి!

అమిగోస్‌తో కల్యాణ్ రామ్ రాక

అమిగోస్‌తో కల్యాణ్ రామ్ రాక

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా సినిమానే 'అమిగోస్'. రాజేంద్ర రెడ్డి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు నిర్మించారు. దీనికి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు చేశారు.

అమిగోస్ ప్రీ బిజినెస్ డీటేల్స్

అమిగోస్ ప్రీ బిజినెస్ డీటేల్స్

కల్యాణ్ రామ్‌కు మంచి మార్కెట్ ఉన్నా 'అమిగోస్' మూవీకి బిజినెస్ అంతగా సాగలేదు. నైజాంలో రూ. 3.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.10 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 4.20 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.10 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.40 కోట్లతో కలిపి రూ. 11.30 కోట్ల బిజినెస్ అయింది.

రెండో రోజు ఎంత రాబట్టింది?

రెండో రోజు ఎంత రాబట్టింది?

'అమిగోస్'కు తెలుగు రాష్ట్రాల్లో 2వ రోజు వసూళ్లు సగానికి పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 38 లక్షలు, సీడెడ్‌లో రూ. 15 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో కలిపి.. రూ. 1.11 కోట్లు షేర్, రూ. 1.75 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

2 రోజుల్లో కలిపి ఎంతొచ్చింది?

2 రోజుల్లో కలిపి ఎంతొచ్చింది?

'అమిగోస్'కు రెండు రోజులకు కలిపి ఓ మోస్తరు వసూళ్లే దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.09 కోట్లు, సీడెడ్‌లో రూ. 44 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 37 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 29 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 41 లక్షలు, కృష్ణాలో రూ. 23 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలతో కలిపి.. రూ. 3.14 కోట్లు షేర్, రూ. 5.25 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

 ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

ఆంధ్రా, తెలంగాణలో కల్యాణ్ రామ్ నటించిన 'అమిగోస్' మూవీకి 2 రోజుల్లో రూ. 3.14 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 28 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 50 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే రెండు రోజుల్లో ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 3.92 కోట్లు షేర్‌తో పాటు రూ. 6.85 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?

కల్యాణ్ రామ్ - అషిక రంగనాథ్ జంటగా నటించిన 'అమిగోస్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12.00 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 3.92 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 8.08 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

రెండో రోజు ఇంత తక్కువగా

రెండో రోజు ఇంత తక్కువగా

కల్యాణ్ రామ్ - రాజేంద్ర రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన 'అమిగోస్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 3.92 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. ఇది ఈ నందమూరి హీరో రేంజ్‌కు చాలా తక్కువ అనే చెప్పాలి. ఇక, 'బింబిసార' అయితే రెండు రోజుల్లో రూ. 10.82 కోట్లు రాబట్టింది. దీంతో 'అమిగోస్' వసూళ్లను చూసి చాలా మంది ఆశ్చర్యపోతోన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X