Amigos 3 Days Collections: సండే ఊహించని వసూళ్లు.. వీకెండ్‌లో షాక్.. ఇంకెన్ని కోట్లు వస్తే హిట్ అంటే!
నందమూరి ఫ్యామిలీలో ఇప్పుడు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఓ రేంజ్‌లో ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుని సత్తా చాటుతోన్నాడు కల్యాణ్ రామ్. రెండు దశాబ్దాల క్రితమే హీరోగా పరిచయమైన అతడు.. సక్సెస్‌లను మాత్రం అంతగా అందుకోలేదు. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'బింబిసార'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు 'అమిగోస్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్ మూవీ 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూసేద్దాం పదండి!

అమిగోస్ అంటూ వచ్చేశాడుగా
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా చేసిన మరో ప్రయోగమే 'అమిగోస్'. రాజేంద్ర రెడ్డి అనే నూతన దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు నిర్మించారు. దీనికి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రలను పోషించారు.

అమిగోస్ ప్రీ బిజినెస్ డీటేల్స్
నందమూరి కల్యాణ్ రామ్‌కు మంచి మార్కెట్ ఉన్నా 'అమిగోస్'కు బిజినెస్ తక్కువే అయింది. దీంతో నైజాంలో రూ. 3.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.10 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 4.20 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.10 కోట్లకు అమ్ముడైంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.40 కోట్లతో కలిపి రూ. 11.30 కోట్ల బిజినెస్ జరిగింది.

మూడో రోజు ఎంత రాబట్టింది?
'అమిగోస్'కు తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజు వసూళ్లు కాస్త పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 29 లక్షలు, సీడెడ్‌లో రూ. 26 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 18 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 12 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలతో కలిపి.. రూ. 1.21 కోట్లు షేర్, రూ. 1.90 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

3 రోజుల్లో కలిపి ఎంతొచ్చింది?
'అమిగోస్'కు మూడు రోజులకు కలిపి వసూళ్లు పర్వాలేదనిపించాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.28 కోట్లు, సీడెడ్‌లో రూ. 80 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 55 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 41 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 24 లక్షలు, గుంటూరులో రూ. 51 లక్షలు, కృష్ణాలో రూ. 35 లక్షలు, నెల్లూరులో రూ. 21 లక్షలతో కలిపి.. రూ. 4.35 కోట్లు షేర్, రూ. 7.15 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా రాణించని కల్యాణ్ రామ్ 'అమిగోస్' మూవీకి 3 రోజుల్లో రూ. 4.50 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 30 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 60 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మూడు రోజుల్లో ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 5.25 కోట్లు షేర్‌తో పాటు రూ. 9.00 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
కల్యాణ్ రామ్ - అషిక రంగనాథ్ కలయికలో రూపొందిన 'అమిగోస్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12.00 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 5.25 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 6.75 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ అవుతుంది.

ఫస్ట్ వీకెండ్ మరీ తక్కువగా
కల్యాణ్ రామ్ - రాజేంద్ర రెడ్డి కలయికలో వచ్చిన 'అమిగోస్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో రూ. 5.25 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. ఇది అతడి రేంజ్‌కు చాలా తక్కువ అనే చెప్పాలి. ఇక, 'బింబిసార' అయితే మూడు రోజుల్లో రూ. 18.29 కోట్లు రాబట్టింది. అంటే.. 'అమిగోస్' అందులో మూడో వంతు కూడా రాబట్టలేదు. మరి వీక్ డేస్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











