Amigos Day 4 Collections: దారుణంగా పడిపోయిన అమిగోస్ వసూళ్లు.. తెలుగులో ఘోరంగా.. ఎంతొచ్చిదంటే?
బాల గోపాలుడు చిత్రంతో బాలనటుడిగా పరిచయమయ్యాడు నందమూరి కల్యాణ్ రామ్. 2003లో వచ్చిన తొలి చూపులోనే సినిమాతో హీరోగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చాడు. 2005లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాతగా, హీరోగా తెరకెక్కించిన అతనొక్కడే మూవీతో మాసీవ్ హిట్ కొట్టాడు కల్యాణ్ రామ్.
ఈ సినిమాతో సురేందర్ రెడ్డిని డైరెక్టర్‌గా పరిచయం చేసిన కల్యాణ్ రామ్ అప్పటినుంచి విభిన్నమైన కథలను రూపొందిస్తూ కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నాడు. తాజాగా అమిగోస్ సినిమాతో రాజేంద్ర రెడ్డిని దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేశారు. ఫిబ్రవరి 10న విడుదలైన ఈ సినిమా నాలుగో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం!

కన్నడ భామ హీరోయిన్ గా..
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మొదటిసారి త్రిపాత్రాభినయం చేసిన ప్రయోగాత్మక చిత్రం అమిగోస్. న్యూ డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ, తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంపై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని రూపొందించిన ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం సమకూర్చాడు.

ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..
నందమూరి కల్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్ తొలిసారి జోడీ కట్టిన 'అమిగోస్' చిత్రానికి ఊహించని విధంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో నైజాంలో రూ. 3.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.10 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 4.20 కోట్ల మేర బిజినెస్ జరిగిందని సమాచారం. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.10 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే.. రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.40 కోట్లతో కలిపి రూ. 11.30 కోట్ల బిజినెస్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా రూ. 12 కోట్లు నమోదు అయింది.

తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు..
హీరోగా, విలన్ గా అన్నీ తానై నటించిన నందమూరి కల్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ 'అమిగోస్'కు తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు వసూళ్లు పడిపోయాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాలు కలుపుకుని మొత్తంగా నాలుగో రోజు రూ. 35 లక్షల కలెక్షన్స్ వసూళు అయ్యాయి.

నాలుగు రోజుల్లో మొత్తంగా..
ఎన్నో రాత్రు వస్తాయి కానీ రాదే వెన్నెలమ్మ అంటూ బాలకృష్ణ సాంగ్ ను రీమేక్ చేసి కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు కల్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్. అయితే 'అమిగోస్' చిత్రానికి 4 రోజులకు కలిపి వసూళ్లు పర్వాలేదనిపించాయి. దీంతో నైజాంలో రూ. 1.36 కోట్లు, సీడెడ్‌లో రూ. 88 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 59 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 44 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 26 లక్షలు, గుంటూరులో రూ. 55 లక్షలు, కృష్ణాలో రూ. 39 లక్షలు, నెల్లూరులో రూ. 23 లక్షలతో కలిపి.. రూ. 4.70 కోట్లు షేర్, రూ. 7.75 కోట్లు గ్రాస్ వసూళు అయింది.

వరల్డ్ వైడ్ గా అమిగోస్ కు..
నందమూరి కల్యాణ్ రామ్-రాజేంద్ర రెడ్డి కాంబినేషన్ మూవీ అమిగోస్ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వసూళ్లు కలెక్ట్ చేయలేకపోయిందనే చెప్పుకోవచ్చు. అమిగోస్ చిత్రానికి 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.70 కోట్లు షేర్ మాత్రమే రాగా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 31 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 64 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే నాలుగు రోజుల్లో అమిగోస్ చిత్రానికి ఊహించని విధంగా రూ. 5.65 కోట్లు షేర్‌తో పాటు రూ. 9.75 కోట్లు గ్రాస్ వసూలైంది.

హిట్ కావాలంటే..
నందమూరి కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన అమిగోస్ సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12.00 కోట్లుగా నమోదైంది. ఇక ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ. 5.65 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 6.35 కోట్లు రాబడితేనే నందమూరి కల్యాణ్ రామ్ ప్రయోగాత్మక చిత్రం అమిగోస్ క్లీన్ హిట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











