Amigos 5 Days Collections: అమిగోస్ కలెక్షన్లు ఢమాల్.. 5 రోజుల్లో ఘోరంగా.. హిట్ అవ్వాలంటే మాత్రం!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న హీరోనే నందమూరి కల్యాణ్ రామ్. నిర్మాతగా, హీరోగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. గత ఏడాది వచ్చిన 'బింబిసార'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే అతడు తాజాగా 'అమిగోస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఈ చిత్రానికి కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ నేపథ్యంలో అమిగోస్ 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

అమిగోస్ అంటూ వచ్చేశాడుగా
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'అమిగోస్'. రాజేంద్ర రెడ్డి అనే నూతన దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు నిర్మించారు. దీనికి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు చేశారు.

అమిగోస్ ప్రీ బిజినెస్ డీటేల్స్
నందమూరి కల్యాణ్ రామ్‌కు మార్కెట్‌కు భిన్నంగా 'అమిగోస్'కు బిజినెస్ తక్కువే అయింది. దీంతో నైజాంలో రూ. 3.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.10 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 4.20 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.10 కోట్లకు అమ్ముడైంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.40 కోట్లతో కలిపి రూ. 11.30 కోట్ల బిజినెస్ అయింది.

ఐదో రోజు ఎంత రాబట్టింది?
కల్యాణ్ రామ్ - అషికా రంగనాథ్ జంటగా నటించిన 'అమిగోస్' చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దీనికి చాలా తక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐదో రోజు వసూళ్లు మరింతగా పడిపోయాయి. ఫలితంగా ఈ సినిమాకు ఐదో రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కేవలం రూ. 23 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది.

5 రోజుల్లో కలిపి ఎంతొచ్చింది?
'అమిగోస్'కు 5 రోజులకు కలిపి వసూళ్లు తక్కువగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.43 కోట్లు, సీడెడ్‌లో రూ. 94 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 62 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 45 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు, గుంటూరులో రూ. 57 లక్షలు, కృష్ణాలో రూ. 41 లక్షలు, నెల్లూరులో రూ. 24 లక్షలతో కలిపి.. రూ. 4.93 కోట్లు షేర్, రూ. 8.20 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
రెండు రాష్ట్రాల్లో పెద్దగా రాణించని కల్యాణ్ రామ్ 'అమిగోస్' మూవీకి 5 రోజుల్లో రూ. 4.93 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 31 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 68 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఐదు రోజుల్లో ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 5.92 కోట్లు షేర్‌తో పాటు రూ. 10.30 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
కల్యాణ్ రామ్ - రాజేంద్ర రెడ్డి కాంబోలో రూపొందిన 'అమిగోస్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12.00 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 5.92 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 6.08 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ అవుతుంది.

మరీ ఇంత తక్కువ వసూళ్లు
కల్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి రూపొందించిన 'అమిగోస్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఆశించిన రీతిలో కలెక్షన్లు దక్కడం లేదు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్ రన్‌తోనే నడుస్తోంది. హిట్ అవ్వాలంటే మాత్రం ఇంకా ఆరు కోట్ల రూపాయలకు పైగానే వసూలు చేయాలి. అయితే, ఇదే కంటిన్యూ అయితే టార్గెట్ చేరడం కష్టమే అని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











