Amigos 6 Days Collections: కల్యాణ్ రామ్‌కు బిగ్ షాక్.. 6 రోజుల్లో ఇంతే.. ఇంకెన్ని కోట్లు రావాలంటే!

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపుతో దూసుకుపోతోన్న హీరోలు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. అందులో కల్యాణ్ రామ్ ఒకడు. సినీ కుటుంబ నేపథ్యంతో వచ్చినా.. కష్టపడేతత్వంతో మంచి పేరును సంపాదించుకున్న అతడు.. గత ఏడాది వచ్చిన 'బింబిసార'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే అతడు తాజాగా 'అమిగోస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఈ చిత్రానికి కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రావట్లేదు. ఈ నేపథ్యంలో అమిగోస్ 6 రోజుల్లో రిపోర్టు మీకోసం!

అమిగోస్‌‌తో మరో ప్రయోగంతో

అమిగోస్‌‌తో మరో ప్రయోగంతో

నందమూరి కల్యాణ్ రామ్ - రాజేంద్ర రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'అమిగోస్'. డాపుల్ గ్యాంగర్ అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు నిర్మించారు. దీనికి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

అమిగోస్ ప్రీ బిజినెస్ డీటేల్స్

అమిగోస్ ప్రీ బిజినెస్ డీటేల్స్

కల్యాణ్ రామ్‌కు మంచి మార్కెట్ ఉన్నా 'అమిగోస్'కు బిజినెస్ తక్కువే అయింది. దీంతో నైజాంలో రూ. 3.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.10 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 4.20 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.10 కోట్లకు అమ్ముడైంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.40 కోట్లతో కలిపి రూ. 11.30 కోట్ల బిజినెస్ జరిగింది.

ఆరో రోజు ఎంత రాబట్టింది?

ఆరో రోజు ఎంత రాబట్టింది?

నందమూరి కల్యాణ్ రామ్ - అషికా రంగనాథ్ జంటగా నటించిన 'అమిగోస్' చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దీనికి చాలా తక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆరో రోజు వసూళ్లు మరింతగా పడిపోయాయి. ఫలితంగా ఈ సినిమాకు 6వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కేవలం రూ. 16 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

 6 రోజుల్లో కలిపి ఎంతొచ్చింది?

6 రోజుల్లో కలిపి ఎంతొచ్చింది?

6 రోజులకు కలిపి 'అమిగోస్'కు వసూళ్లు తక్కువగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.48 కోట్లు, సీడెడ్‌లో రూ. 97 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 65 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 46 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, గుంటూరులో రూ. 58 లక్షలు, కృష్ణాలో రూ. 42 లక్షలు, నెల్లూరులో రూ. 25 లక్షలతో కలిపి.. రూ. 5.09 కోట్లు షేర్, రూ. 8.55 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

ఆంధ్రా, తెలంగాణలో పెద్దగా రాణించని కల్యాణ్ రామ్ 'అమిగోస్' మూవీకి 6 రోజుల్లో రూ. 5.09 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 32 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 70 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 6 రోజుల్లో ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 6.11 కోట్లు షేర్‌తో పాటు రూ. 10.70 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?

కల్యాణ్ రామ్ మూడు పాత్రల్లో నటించిన 'అమిగోస్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12.00 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 6.11 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 5.89 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ స్టేటస్‌ను చేరుకుంటుంది.

ఇలా అయితే టార్గెట్ కష్టమే

ఇలా అయితే టార్గెట్ కష్టమే

కల్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన 'అమిగోస్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఆశించిన రీతిలో కలెక్షన్లు దక్కడం లేదు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశజనకంగా సాగుతోంది. దీనికితోడు శుక్రవారం, శనివారం సినిమాలు రాబోతున్నాయి. దీంతో కల్యాణ్ రామ్ మూవీ టార్గెట్‌ను చేరుకోవడం కష్టమే అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X