Amigos Day 1 Collections: అమిగోస్‌కు షాకింగ్ కలెక్షన్లు.. ఆ ఫ్లాప్ మూవీ కంటే తక్కువ.. ఎంత రావాలంటే!

పేరుకు నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరోనే అయినా.. కష్టపడేతత్వంతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతోన్నాడు కల్యాణ్ రామ్. ఒకవైపు హీరోగా.. మరోవైపు నిర్మాతగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న అతడు.. గత ఏడాది 'బింబిసార'తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'అమిగోస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు షాకింగ్ కలెక్షన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమిగోస్ ఫస్ట్ డే రిపోర్టును చూద్దాం పదండి!

 అమిగోస్‌తో కల్యాణ్ ప్రయోగం

అమిగోస్‌తో కల్యాణ్ ప్రయోగం

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా.. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమానే 'అమిగోస్'. ఈ చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దీనికి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రలను పోషించారు.

అమిగోస్ ప్రీ బిజినెస్ డీటేల్స్

అమిగోస్ ప్రీ బిజినెస్ డీటేల్స్

కల్యాణ్ రామ్ మార్కెట్‌, బింబిసార హిట్ ప్రభావం లేకుండానే 'అమిగోస్' మూవీకి నైజాంలో రూ. 3.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.10 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 4.20 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.10 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.40 కోట్లతో కలిపి రూ. 11.30 కోట్ల బిజినెస్ చేసింది.

 అలాంటి టాక్... వసూళ్లు ఇలా

అలాంటి టాక్... వసూళ్లు ఇలా

ఎన్నో అంచనాల నడుమ రూపొందిన 'అమిగోస్' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ మాత్రమే వచ్చింది. అందుకు అనుగుణంగానే రివ్యూలు కూడా ఏవరేజ్‌గానే వచ్చాయి. దీంతో ఈ సినిమాకు అనుకున్న విధంగా ఓపెనింగ్ డేన కలెక్షన్లు వచ్చే అవకాశం ఉండదని విశ్లేషకులు అంచనా వేశారు.

తొలి రోజు ఎంత రాబట్టింది?

తొలి రోజు ఎంత రాబట్టింది?

'అమిగోస్'కు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే అనుకున్న రేంజ్‌లో వసూళ్లు రాలేదు. ఫలితంగా నైజాంలో రూ. 71 లక్షలు, సీడెడ్‌లో రూ. 29 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 23 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, గుంటూరులో రూ. 31 లక్షలు, కృష్ణాలో రూ. 13 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో కలిపి.. రూ. 2.03 కోట్లు షేర్, రూ. 3.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

కల్యాణ్ రామ్ నటించిన 'అమిగోస్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రూ. 2.03 కోట్లు మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 35 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 2.58 కోట్లు షేర్‌తో పాటు రూ. 4.65 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అమిగోస్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12.00 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 2.58 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 9.42 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

ఆ ఫ్లాప్ మూవీ కంటే తక్కువ

ఆ ఫ్లాప్ మూవీ కంటే తక్కువ

కల్యాణ్ రామ్ - అషికా రంగనాథ్ కాంబినేషన్‌లో రూపొందిన 'అమిగోస్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.58 కోట్లు షేర్ వచ్చింది. ఇది అతడి గత చిత్రాల కంటే చాలా తక్కువ అనే చెప్పాలి. కల్యాణ్ కెరీర్‌లో 'బింబిసార' రూ. 6.30 కోట్లు సాధించి టాప్‌లో నిలవగా.. 'ఇజం' రూ. 3.09 కోట్లు, MLA రూ. 2.72, 'ఎంత మంచివాడవురా' రూ. 2.20 కోట్లు వసూలు చేశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X