Amigos Day 2 Collections: అమిగోస్‌కు మరో షాక్.. రెండో రోజే ఇంత తక్కువగా.. అదే జరిగితే పెరిగే ఛాన్స్
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో నందమూరి ఫ్యామిలీకి చెందిన కల్యాణ్ రామ్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్నా.. కొన్ని విజయాలను మాత్రం దక్కించుకున్న అతడు.. గత ఏడాది వచ్చిన 'బింబిసార'తో కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు 'అమిగోస్' మూవీతో వచ్చాడు. దీనికి మొదటి రోజు ఆశించిన వసూళ్లు మాత్రం రాలేదు. మరి రెండో రోజు ఈ సినిమా పరిస్థితి ఏంటి అనే దానిపై లుక్కేద్దాం పదండి!

అమిగోస్ అంటూ వచ్చిన హీరో
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా సినిమానే 'అమిగోస్'. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు నిర్మించారు. దీనికి గిబ్రాన్ సంగీతాన్ని ఇచ్చాడు. ఇందులో బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.

అమిగోస్ ప్రీ బిజినెస్ డీటేల్స్
కల్యాణ్ రామ్ 'అమిగోస్'కు ఊహించని విధంగా బిజినెస్ జరిగింది. దీంతో ఈ మూవీకి నైజాంలో రూ. 3.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.10 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 4.20 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.10 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.40 కోట్లతో కలిపి రూ. 11.30 కోట్ల బిజినెస్ అయింది.

అలాంటి టాక్.. తొలి రోజు ఇలా
క్రేజీ కాన్సెప్టుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'అమిగోస్' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ మాత్రమే వచ్చింది. దీంతో కల్యాణ్ రామ్ నటించిన ఈ సినిమాకు ఎవరూ ఊహించని విధంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.58 కోట్లు షేర్‌తో పాటు రూ. 4.65 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలైంది.

రెండో రోజు ఎంత రావొచ్చంటే
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'అమిగోస్'కు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే అనుకున్న రేంజ్‌లో వసూళ్లు రాలేదు. దీంతో హాలీడే ఉన్న రెండో రోజైనా కలెక్షన్లు పెరుగుతాయని అంతా భావించారు. కానీ, ఊహించని విధంగా రెండో రోజు హోల్డ్ చేయలేకపోవడంతో దీనికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 80 - 90 లక్షలు షేర్ మాత్రమే వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మరి
కల్యాణ్ రామ్ - రాజేంద్ర రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన 'అమిగోస్' మూవీకి మొదటి రోజు రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 55 లక్షలు షేర్ వచ్చింది. అయితే, రెండో రోజు మాత్రం యాభై శాతం వరకూ డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. ఫలితంగా రెండో రోజు ఆ ఏరియాల్లో రూ. 25 - 28 లక్షలు మాత్రమే రావొచ్చట. అంటే.. మొత్తంగా రూ. 1.20 - 1.30 కోట్లు షేర్ వచ్చే ఛాన్స్ ఉంది.

అదే జరిగితే కాస్త పెరగొచ్చని
నందమూరి కల్యాణ్ రామ్ - అషికా రంగనాథ్ జంటగా నటించిన 'అమిగోస్' మూవీకి రెండో రోజు మార్నింగ్, మ్యాట్నీ షోలకు అశించిన రీతిలో రెస్పాన్స్ రాలేదు. కానీ, సాయంత్రం ఆటల్లో మాత్రం ఇది కాస్త పుంజుకున్నట్లు తెలిసింది. ఇక, ఆఫ్‌లైన్ టికెట్ల విక్రయాల్లో కూడా జోరు చూపిస్తే.. రెండో రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.50 కోట్లు షేర్ రాబట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











