Amigos Day 3 Collections: అమిగోస్‌కు దారుణంగా కలెక్షన్స్.. కలిసి రాని సండే.. 2 రోజుల కంటే!
బాల గోపాలుడు చిత్రంతో బాలనటుడిగా పరిచయమయ్యాడు నందమూరి కల్యాణ్ రామ్. 2003లో వచ్చిన తొలి చూపులోనే సినిమాతో హీరోగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చాడు. 2005లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాతగా, హీరోగా తెరకెక్కించిన అతనొక్కడే మూవీతో మాసీవ్ హిట్ కొట్టాడు కల్యాణ్ రామ్. ఈ సినిమాతో సురేందర్ రెడ్డిని డైరెక్టర్‌గా పరిచయం చేసిన కల్యాణ్ రామ్ అప్పటినుంచి విభిన్నమైన కథలను రూపొందిస్తూ కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నాడు. అలా ఇటీవల బింబిసారతో వశిష్ఠ అనే కొత్త డైరెక్టర్ ను పరిచయంచేసిన కల్యాణ్ రామ్ తాజాగా అమిగోస్ తో రాజేంద్ర రెడ్డిని దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేశారు. ఫిబ్రవరి 10న విడుదలైన ఈ సినిమా మూడో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం!

ప్రయోగాత్మక చిత్రాలతో..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్లాపులు ఎదురైన విభిన్నమైన చిత్రాలతో ప్రయోగాలు చేసే హీరోలు అతి తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉన్న యంగ్ హీరోల్లో నందమూరి హీరో కల్యాణ్ రామ్ ఒకరు. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ ఉండే కల్యాణ్ రామ్ తాజా చిత్రం అమిగోస్. ఈ సినిమాతో రాజేంద్ర రెడ్డి అనే న్యూ డైరెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేశాడు కల్యాణ్ రామ్.

రూ. 12 కోట్లుగా బ్రేక్ ఈవెన్..
నందమూరి కల్యాణ్ రామ్ 'అమిగోస్' చిత్రానికి ఊహించని విధంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో నైజాంలో రూ. 3.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.10 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 4.20 కోట్ల మేర బిజినెస్ జరిగిందని సమాచారం. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.10 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే.. రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.40 కోట్లతో కలిపి రూ. 11.30 కోట్ల బిజినెస్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా రూ. 12 కోట్లు నమోదు అయింది.

థియేటర్ ఆక్యుపెన్సీ డీటెల్స్..
ఇటీవల బింబిసారతో ఆకట్టుకున్న కల్యాణ్ రామ్ మరో ప్రయోగాత్మక చిత్రమే అమిగోస్. కల్యాణ్ రామ్ మొదటిసారిగా త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో కన్నడ, తమిళంలో పాపులర్ అయన బ్యూటిఫుల్ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకు మూడో రోజు ఉదయం 30.65 శాతం, మధ్యాహ్నం కాస్తా పెరిగి 35.16 శాతం, సాయంత్రం 37.53 శాతంగా షోలతో థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.

మొదటి 2 రోజులకంటే తక్కువగా..
కొత్త డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన కల్యాణ్ రామ్ అమిగోస్ చిత్రాన్ని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు నిర్మించారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ సంగీతం సమకూర్చాడు. బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచి అనుకున్నంత స్థాయిలో వసూళ్లు రావట్లేదు. ఈ క్రమంలో అమిగోస్ కు మూడో రోజు రూ. 1 కోటి ఇండియా నెట్ కలెక్షన్స్ వసూళు అయినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అంటే మొదటి రెండు రోజులతో పోల్చుకుంటే మూడో రోజు తక్కువగా వసూళు అయినట్లు తెలుస్తోంది.

కలిసి రాని సండే..
నందమూరి నటసింహం బాలకృష్ణ మోస్ట్ పాపులర్ సాంగ్ ఎన్నో రాత్రులు వస్తాయి గానీ అనే పాటను కల్యాణ్ రామ్ అమిగోస్ చిత్రంలో రీమెక్ చేశారు. ఈ పాటతోపాటు కల్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీ ఆకట్టుకున్నప్పటికీ స్లో స్క్రీన్ ప్లే, ఫస్టాఫ్ లో రొటీన్ లవ్ స్టోరీతో అమిగోస్ మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రానికి మూడు రోజుల్లో మొత్తంగా రూ. 5.75 కోట్లు వసూళు అయినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అంటే అమిగోస్ చిత్రానికి ఆదివారం కూడా కలిసిరాలేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











