Amigos Day 4 Collections: కలిసొచ్చిన మండే.. పర్వాలేదనిపించిన కలెక్షన్స్.. హిట్ కావాలంటే మాత్రం!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో నందమూరి కుటుంబానికి చెందిన కల్యాణ్ రామ్ ఒకరు. దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్నా.. కొన్ని విజయాలను మాత్రమే దక్కించుకున్న కల్యాణఅ రామ్ గతేడాది విడుదలైన బింబిసార సినిమాతో కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ జోష్‌లోనే తాజాగా అమిగోస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే ఆశించిన వసూళ్లు రావట్లేదు. ఈ క్రమంలో అమిగోస్ నాలుగో రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే..

కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తూ..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్లాపులు ఎదురైన విభిన్నమైన చిత్రాలతో ప్రయోగాలు చేయడంతోపాటు కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చే హీరోలు చాలా అరుదు. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన హీరో నందమూరి కల్యాణ్ రామ్. సినిమా విజయాపజయాల సంగతి ఎలా ఉన్నా న్యూ టాలెంటెండ్ డైరెక్టర్లకు అవకాశం ఇస్తూ ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ ఉండే కల్యాణ్ రామ్ తాజా చిత్రం అమిగోస్. ఈ సినిమాతో రాజేంద్ర రెడ్డి అనే న్యూ డైరెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేశాడు కల్యాణ్ రామ్.

ప్రీరిలీజ్ బిజినెస్..
నందమూరి కల్యాణ్ రామ్, ఆషిక రంగనాథ్ నటించిన 'అమిగోస్' చిత్రానికి ఊహించని విధంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో నైజాంలో రూ. 3.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.10 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 4.20 కోట్ల మేర బిజినెస్ జరిగిందని సమాచారం. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.10 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే.. రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.40 కోట్లతో కలిపి రూ. 11.30 కోట్ల బిజినెస్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా రూ. 12 కోట్లు నమోదు అయింది.

థియేటర్ ఆక్యుపెన్సీ వివరాలు..
2022 సంవత్సరంలో బింబిసార చిత్రంతో మంచి విజయం అందుకున్న యంగ్ హీరో నందమూరి కల్యాణ్ రామ్ లేటెస్ట్ ప్రయోగాత్మక చిత్రమే అమిగోస్. కల్యాణ్ రామ్ మొదటిసారిగా త్రిపాత్రాభినయం చేసిన ఈ మూవీలో కన్నడ, తమిళంలో పాపులర్ అయన బ్యూటిఫుల్ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకు నాలుగో రోజు ఉదయం 31.69 శాతం, మధ్యాహ్నం కాస్తా పెరిగి 28.92 శాతం, సాయంత్రం 29.61 శాతంగా షోలతో థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయినట్లు తెలుస్తోంది.

కలిసొచ్చిన సోమవారం..
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై యలమంచిలి రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మించిన అమిగోస్ చిత్రానికి న్యూ డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం సమకూర్చారు. అయితే అమిగోస్ సినిమాకు మొదటి రోజు నుంచి అనుకున్నంత స్థాయిలో వసూళ్లు రావడం లేదు. ఈ క్రమంలో అమిగోస్ కు నాలుగో రోజు రూ. 1 కోటికిపైగా ఇండియా నెట్ కలెక్షన్స్ నమోదు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే వీకెండ్ లో కూడా పెద్దగా వర్కౌట్ కాని ఈ చిత్రానికి మండే కలెక్షన్స్ పర్వాలేదనిపించాయి. ఈ విధంగా అమిగోస్ కు మండే కలిసొచ్చిందనే చెప్పవచ్చు.

క్లీన్ హిట్ కి ఎంత రావాలంటే..
నందమూరి కల్యాణ్ రామ్ మొదటి సారిగా మూడు డిఫరెంట్ నేచర్స్ గల పాత్రలు చేసిన అమిగోస్ చిత్రానికి మొదటి రోజు నుంచే మిక్స్ డ్ టాక్ వస్తోంది. ఫలితంగా కలెక్షన్స్ అంతంతమాత్రంగానే నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే అమిగోస్ చిత్రానికి మొత్తంగా నాలుగు రోజుల్లో రూ. 7.45 కోట్లు వసూళు అయినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అంటే ఇంకా రూ. 4.55 కోట్లు వస్తే ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











