Amigos Business: అమిగోస్‌కు షాకింగ్ బిజినెస్.. హిట్ కొట్టినా ఇన్ని కోట్లేనా.. థియేటర్ల లెక్క చూస్తే!
బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు టాలెంటెడ్ గాయ్ నందమూరి కల్యాణ్ రామ్. కెరీర్ ఆరంభం నుంచే హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. గత ఏడాది 'బింబిసార'తో బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు కల్యాణ్ రామ్ 'అమిగోస్' అనే ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్, థియేటర్ల వివరాలను చూసేద్దాం పదండి!

అమిగోస్‌గా వస్తున్న కల్యాణ్ రామ్
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రమే 'అమిగోస్'. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దీనికి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు చేశారు.

అలాంటి స్టోరీ.. తొలిసారి ఆ జోనర్
నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్‌లో వస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రమే 'అమిగోస్'. ఈ మూవీ డాపుల్ గ్యాంగర్స్ అనే కాన్సెప్టుతో రాబోతుంది. ఒకే పోలిక ఉన్న ముగ్గురు సంబంధం లేని వ్యక్తులు కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్లంతా కలవడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే అంశాలతో ఇది తెరకెక్కింది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

ప్రమోషన్స్ షురూ.. యమ సందడి
కల్యాణ్ రామ్ - రాజేంద్ర రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన ఈ మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు చేసింది. అలాగే, ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసుకున్నారు. ఇక, గురువారం సాయంత్రమే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఏపీ, తెలంగాణలో బిజినెస్ ఇలా
కల్యాణ్ రామ్ 'అమిగోస్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా తక్కువగానే బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 3.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.10 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 4.20 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తంగా రూ. 9.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది.

ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా
'బింబిసార' హిట్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'అమిగోస్' మూవీ థియేట్రికల్ హక్కుల కోసం పోటీ ఉన్నా బిజినెస్ ఆశించిన రీతిలో జరగలేదు. దీంతో ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 1.40 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి మొత్తంగా రూ. 11.30 కోట్లు బిజినెస్ జరిగింది.

అన్ని కోట్లు వస్తేనే సినిమా హిట్
రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'అమిగోస్' చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఆశించిన రీతిలో బిజినెస్ జరగలేదనే చెప్పాలి. ఇక, ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 11.30 కోట్లు బిజినెస్‌ను జరుపుకుంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12 కోట్లుగా నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వస్తేనే ఇది హిట్ స్టేటస్ చేరుతుంది.

తక్కువ థియేటర్లలో విడుదల
'బింబిసార'తో పోలిస్తే 'అమిగోస్' మూవీకి థియేటర్లు కూడా తక్కువగానే వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని నైజాంలో 152, సీడెడ్‌లో 60, ఆంధ్రా ప్రాంతంలోని అన్ని ఏరియాల్లో కలిపి 210 థియేటర్లలో విడుదల కాబోతుంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 60, ఓవర్సీస్‌లో 260 థియేటర్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా 742 లొకేషన్లలో ఇది రిలీజ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











