twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bimbisara 10 Days Collections: పదో రోజు రికార్డు వసూళ్లు.. తెలుగులో ఐదో మూవీ.. మరో 24 లక్షలు వస్తే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తోన్న హీరోల్లో నందమూరి కల్యాణ్ రామ్ ఒకడు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. తద్వారా ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా ఏర్పరచుకున్నాడు. అయితే, చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతోన్న కల్యాణ్ రామ్.. ఇటీవలే 'బింబిసార' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ రెస్పాన్స్ భారీగా లభించింది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో 'బింబిసార' 10 రోజుల వసూళ్లను చూద్దాం పదండి!

    బింబిసారగా కల్యాణ్ రామ్ అరాచకం

    బింబిసారగా కల్యాణ్ రామ్ అరాచకం

    నందమూరి కల్యాణ్ రామ్ - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'బింబిసార'. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలను పోషించారు. కీరవాణి దీనికి సంగీతం అందించారు. టైమ్ ట్రావెల్ కథతో వచ్చిన ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

    ఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ: అందాలన్నీ కనిపించడంతో ఇబ్బందిఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ: అందాలన్నీ కనిపించడంతో ఇబ్బంది

    బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

    బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

    కల్యాణ్ రామ్ మార్కెట్‌ ప్రకారమే 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

    10వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

    10వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

    'బింబిసార' మూవీకి 10వ రోజు ఏపీ, తెలంగాణలో వసూళ్లు మరింత పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 48 లక్షలు, సీడెడ్‌లో రూ. 38 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 24 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో కలిపి రూ. 1.45 కోట్లు షేర్, రూ. 2.25 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న ఫొటోలతో సంచలనంబాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న ఫొటోలతో సంచలనం

    10 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    10 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    10 రోజులకు 'బింబిసార' మూవీకి వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 9.27 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.02 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.93 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.60 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.20 కోట్లు, గుంటూరులో రూ. 1.87 కోట్లు, కృష్ణాలో రూ. 1.36 కోట్లు, నెల్లూరులో రూ. 79 లక్షలతో కలిపి రూ. 26.04 కోట్లు షేర్‌, రూ. 40.92 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 రోజుల్లో రూ. 26.04 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.02 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే పది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 29.76 కోట్లు షేర్‌తో పాటు రూ. 49.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ఫ్లైట్‌లోనే నయనతార - విఘ్నేష్ రచ్చ: భర్త మీద కూర్చుని.. ఏకంగా అక్కడ ముద్దు పెట్టేసి!ఫ్లైట్‌లోనే నయనతార - విఘ్నేష్ రచ్చ: భర్త మీద కూర్చుని.. ఏకంగా అక్కడ ముద్దు పెట్టేసి!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?


    క్రేజీ సబ్జెక్టుతో వచ్చిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లోనే దీనికి రూ. 29.76 కోట్లు వచ్చాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 13.56 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

    మరో రికార్డుకు చేరువ.. ఐదో మూవీ

    మరో రికార్డుకు చేరువ.. ఐదో మూవీ

    'బింబిసార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. దీంతో ఈ సినిమా 10వ రోజు రూ. 1.45 కోట్లు వసూలు చేసింది. తద్వారా పదో రోజు ఎక్కువ వసూళ్లు రాబట్టిన టైర్ 2 హీరోల చిత్రాల జాబితాలో ఇది ఐదో స్థానానికి చేరుకుంది. ఇక, ఈ చిత్రం మరో 24 లక్షలు వసూలు చేస్తే రూ. 30 కోట్ల షేర్ మార్కును చేరుకుని రికార్డు సృష్టిస్తుంది.

    English summary
    Nandamuri Kalyan Ram Now Did Bimbisara Movie Under Mallidi Vashist Direction. This Movie Collect 29.76 Cr in 10 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X