Bimbisara 11 Days Collections: హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో బాంబిసార బీభత్సం.. కళ్యాణ్ రామ్ న్యూ రికార్డ్!
తెలుగు చిత్ర పరిశ్రమంలో చాలా రోజుల తర్వాత వరుస సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటున్నాయి. ముఖ్యంగా గతంలో సక్సెస్ చూడలేని వారు కూడా ఇప్పుడు సాలిడ్ విజయాలను సొంతం చేసుకోవడం విశేషం. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో తన కెరీర్ లోనే మొట్టమొదటిసారి అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన 11వ రోజు కలెక్షన్స్ అయితే ఊహలకందని రేంజ్ లో వచ్చాయి. ఇక ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం తెచ్చింది అనే వివరాల్లోకి వెళితే..

బింబిసార బిజినెస్
కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

11వ ఏపీ, తెలంగాణలో
'బింబిసార' సినిమా 11వ రోజు ఏపీ, తెలంగాణలో వసూళ్లు ఉహించని విధంగా పెరిగాయి. చాలా చోట్ల హౌస్ ఫుల్ అయ్యాయి. నైజాంలో రూ. 52 లక్షలు, సీడెడ్‌లో రూ. 39 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 28 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి రూ. 1.52 కోట్లు షేర్, రూ. 2.40 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

11 రోజుల టోటల్ కలెక్షన్స్
11 రోజులకు 'బింబిసార' మూవీకి వసూళ్లు భారీగా వచ్చాయి. నైజాంలో రూ. 9.79 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.41 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.21 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.68 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.26 కోట్లు, గుంటూరులో రూ. 1.96 కోట్లు, కృష్ణాలో రూ. 1.43 కోట్లు, నెల్లూరులో రూ. 82 లక్షలతో కలిపి రూ. 27.56 కోట్లు షేర్, రూ. 43.32 కోట్లు గ్రాస్ వచ్చింది.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 11 రోజుల్లో రూ. 27.56 కోట్లు రాబట్టిన 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.10 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 11 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 31.61 కోట్లు షేర్‌తో పాటు రూ. 52.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

లాభాలు ఎంతంటే?
'బింబిసార' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగింది. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. 11 రోజుల్లోనే దీనికి రూ. 31.61 కోట్లు వచ్చాయి. దీంతో సినిమా క్లీన్ డబుల్ బ్లాక్ బాస్టర్ స్టేటస్‌తో పాటు రూ. 15.41 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి. ఒక విధంగా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్ అందించిన సినిమాగా నిలిచింది.


Click it and Unblock the Notifications











