Bimbisara 12 Days Collections: మళ్లీ పడిపోయిన వసూళ్లు.. లాభాలు మాత్రం కోట్లలో.. 16‌కు మరో 16 కోట్లా

నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్ తర్వాత చాలా మంది హీరోలుగా పరిచయం అయ్యారు. అందులో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని టాప్ హీరోలుగా వెలుగొందుతోన్నారు. వాళ్లిద్దరి తర్వాత తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో మాత్రం కల్యాణ్ రామ్ అనే చెప్పాలి. చాలా కాలం క్రితమే హీరోగా పరిచయమైన అతడు.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'బింబిసార' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి స్పందన వచ్చింది. ఫలితంగా కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'బింబిసార' 12 రోజుల వసూళ్లను చూద్దాం పదండి!

బింబిసారగా కల్యాణ్ రామ్ సందడి

బింబిసారగా కల్యాణ్ రామ్ సందడి


నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట రూపొందించిన చిత్రమే 'బింబిసార'. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలను పోషించారు. కీరవాణి దీనికి సంగీతం అందించారు. టైమ్ ట్రావెల్ కథతో వచ్చిన ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో తీశారు.

బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

కల్యాణ్ రామ్ మార్కెట్‌‌కు అనుగుణంగానే 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

12వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

12వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?


'బింబిసార' మూవీకి 12వ రోజు ఏపీ, తెలంగాణలో వసూళ్లు మరింత పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 22 లక్షలు, సీడెడ్‌లో రూ. 19 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 13 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి రూ. 72 లక్షలు షేర్, రూ. 1.13 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

12 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

12 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

12 రోజులకు 'బింబిసార' మూవీకి వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 10.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.60 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.34 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.73 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.30 కోట్లు, గుంటూరులో రూ. 2.00 కోట్లు, కృష్ణాలో రూ. 1.46 కోట్లు, నెల్లూరులో రూ. 84 లక్షలతో కలిపి రూ. 28.28 కోట్లు షేర్‌, రూ. 44.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 12 రోజుల్లో రూ. 28.28 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.15 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 12 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 32.43 కోట్లు షేర్‌తో పాటు రూ. 53.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

టైం ట్రావెల్ కథతో వచ్చిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, 12 రోజుల్లోనే దీనికి రూ. 32.43 కోట్లు వచ్చాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 16.23 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

మూవీ బిజినెస్‌కు డబుల్ కలెక్షన్లు

మూవీ బిజినెస్‌కు డబుల్ కలెక్షన్లు

'బింబిసార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఇది మంచిగానే రాణించింది. ఫలితంగా ఈ సినిమాకు ఇప్పటికే రూ. 16.20 కోట్ల లాభాలు సొంతం అయ్యాయి. అంటే.. రూ. 16.20 కోట్ల బిజినెస్ జరగ్గా.. అందుకు సమానంగానే లాభాలు కూడా దక్కాయి. అంతలా బింబిసార హవాను చూపిస్తూ దూసుకెళ్తోన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X