twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bimbisara 13 Days Collections: బింబిసారకు భారీ దెబ్బ.. తొలిసారి ఇంత తక్కువగా.. లాభమెంతో తెలిస్తే!

    |

    బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో హీరోగా పరిచయమైనప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతోన్నాడు నందమూరి కల్యాణ్ రామ్. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నా.. కేవలం కొన్ని హిట్ చిత్రాలను మాత్రమే ఖాతాలో వేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా భారీ సక్సెస్‌ను కొట్టాలన్న పట్టుదలతో ఇటీవలే 'బింబిసార' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన దక్కింది. దీంతో దీనికి కలెక్షన్లు పోటెత్తాయి. అయితే, తొలిసారి 13వ రోజు చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో 'బింబిసార' 13 రోజుల వసూళ్లను మీరే చూడండి!

    బింబిసారగా కల్యాణ్ రామ్ ఎంటర్

    బింబిసారగా కల్యాణ్ రామ్ ఎంటర్

    మల్లిడి వశిష్ట దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ నటించిన చిత్రమే 'బింబిసార'. టైమ్ ట్రావెల్ కథతో వచ్చిన ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో తీశారు. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలను పోషించారు. కీరవాణి దీనికి సంగీతం అందించారు.

    ఫస్ట్ నైట్ గురించి పచ్చిగా మాట్లాడిన విష్ణుప్రియ: ఏకంగా రెండు సార్లు అంటూ నోరు జారడంతో!ఫస్ట్ నైట్ గురించి పచ్చిగా మాట్లాడిన విష్ణుప్రియ: ఏకంగా రెండు సార్లు అంటూ నోరు జారడంతో!

    బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

    బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

    కల్యాణ్ రామ్ మార్కెట్‌, అంచనాల వల్ల 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ అయింది.

    13వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

    13వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

    'బింబిసార' మూవీకి 13వ రోజు ఏపీ, తెలంగాణలో వసూళ్లు మరింత పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 16 లక్షలు, సీడెడ్‌లో రూ. 13 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 43 లక్షలు షేర్, రూ. 75 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

    కాజల్ అగర్వాల్ అందాల విందు: తల్లైన తర్వాత తొలిసారి ఇలా!కాజల్ అగర్వాల్ అందాల విందు: తల్లైన తర్వాత తొలిసారి ఇలా!

    13 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    13 రోజులకు కలిపి ఎంత వచ్చింది?


    13 రోజులకు 'బింబిసార' మూవీకి వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 10.17 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.73 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.41 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.75 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.31 కోట్లు, గుంటూరులో రూ. 2.02 కోట్లు, కృష్ణాలో రూ. 1.47 కోట్లు, నెల్లూరులో రూ. 85 లక్షలతో కలిపి రూ. 28.71 కోట్లు షేర్‌, రూ. 45.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది


    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 13 రోజుల్లో రూ. 28.71 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.04 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.18 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 13 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 32.93 కోట్లు షేర్‌తో పాటు రూ. 54.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

    హాట్ షోతో షాకిచ్చిన కీర్తి సురేష్: ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!హాట్ షోతో షాకిచ్చిన కీర్తి సురేష్: ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?


    ఫాంటసీ జోనర్‌లో వచ్చిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజుల్లోనే దీనికి రూ. 32.93 కోట్లు వచ్చాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 16.73 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

    తొలిసారి ఇంత తక్కువ వసూళ్లు

    తొలిసారి ఇంత తక్కువ వసూళ్లు


    కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఇది మంచిగానే రాణించింది. అయితే, వీక్‌ డేస్‌లో మాత్రం ఇది క్రమంగా ప్రభావాన్ని కోల్పోతోంది. ఈ నేపథ్యంలోనే 13వ రోజు దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 50 లక్షలే వచ్చాయి. ఈ ఫుల్ రన్‌లో దీనికి ఇవే తక్కువ కలెక్షన్లు.

    English summary
    Nandamuri Kalyan Ram Now Did Bimbisara Movie Under Mallidi Vashist Direction. This Movie Collect 32.93 Cr in 13 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X