Bimbisara 15 Days Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. 15వ రోజు కూడా ఇలానా.. మరో 50 లక్షలు వస్తే!
నందమూరి కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు కల్యాణ్ రామ్. ఆరంభంలోనే హీరోగా, నిర్మాతగా ఎన్నో మంచి మంచి చిత్రాలను అందించి ప్రేక్షకులను అలరించాడు. అదే కంటిన్యూ చేస్తూ జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు.
అయితే, చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోన్న కల్యాణ్ రామ్.. ఇటీవలే 'బింబిసార' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు అత్యధికంగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'బింబిసార' 15 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

బింబిసారగా కల్యాణ్ విశ్వరూపం
నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో మల్లిడి వశిష్ట రూపొందించిన చిత్రమే 'బింబిసార'. టైమ్ ట్రావెల్ కథతో వచ్చిన ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో తీశారు. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేశారు. కీరవాణి సంగీతం అందించారు.

బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్
కల్యాణ్ రామ్ మార్కెట్, అంచనాల ప్రకారం 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ అయింది.

15వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?
ఏపీ, తెలంగాణలో 'బింబిసార' మూవీకి 15వ రోజు వసూళ్లు మళ్లీ పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 19 లక్షలు, సీడెడ్‌లో రూ. 15 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలో కలిపి రూ. 50 లక్షలు షేర్, రూ. 85 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

15 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
15 రోజులకు 'బింబిసార' మూవీకి వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 10.47 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.97 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.53 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.79 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.33 కోట్లు, గుంటూరులో రూ. 2.05 కోట్లు, కృష్ణాలో రూ. 1.50 కోట్లు, నెల్లూరులో రూ. 86 లక్షలతో కలిపి రూ. 29.50 కోట్లు షేర్, రూ. 46.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 15 రోజుల్లో రూ. 29.50 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.22 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 15 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 33.82 కోట్లు షేర్‌తో పాటు రూ. 57.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?
సోషియో ఫాంటసీ జోనర్‌లో వచ్చిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, 15 రోజుల్లోనే ఈ సినిమాకు టోటల్‌గా రూ. 33.82 కోట్లు వచ్చాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 17.62 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.



Click it and Unblock the Notifications











