Bimbisara 16 Days Collections: తెలుగు రాష్ట్రాల్లో బింబిసార సంచలనం.. మరో కోటిన్నర వస్తే చరిత్రే!
నందమూరి ఫ్యామిలీలో ప్రస్తుతం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత టాలీవుడ్‌లో సత్తా చాటుతోన్న హీరో కల్యాణ్ రామ్ మాత్రమే. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. దీంతో ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు.
కానీ, విజయాలను మాత్రం పెద్దగా అందుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కల్యాణ్ రామ్ ఇటీవలే 'బింబిసార' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు అధికంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'బింబిసార' 16 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

‘బింబిసార'గా కల్యాణ్ అరాచకం
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో వచ్చిన చిత్రమే 'బింబిసార'. టైమ్ ట్రావెల్ కథతో వచ్చిన ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో తీశారు. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేశారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చారు.

బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్
నందమూరి కల్యాణ్ రామ్ మార్కెట్ ప్రకారం 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 16.60 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

16వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?
ఏపీ, తెలంగాణలో 16వ రోజు 'బింబిసార' మూవీకి వసూళ్లు మళ్లీ పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 20 లక్షలు, సీడెడ్‌లో రూ. 17 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలో కలిపి రూ. 53 లక్షలు షేర్, రూ. 90 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

16 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
'బింబిసార' మూవీకి 16 రోజులకు వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 10.67 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.14 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.58 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.82 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.35 కోట్లు, గుంటూరులో రూ. 2.08 కోట్లు, కృష్ణాలో రూ. 1.52 కోట్లు, నెల్లూరులో రూ. 87 లక్షలతో కలిపి రూ. 30.03 కోట్లు షేర్, రూ. 47.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది
16 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 30.03 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.25 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 16 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 34.43 కోట్లు షేర్‌తో పాటు రూ. 58.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?
టైం ట్రావెల్ కథతో తెరకెక్కిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.60 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, 16 రోజుల్లోనే ఈ సినిమాకు టోటల్‌గా రూ. 34.43 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 18.23 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా
మల్లిడి వశిష్ట దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఇలా ఇప్పటికే ఈ చిత్రం ఏకంగా రూ. 30.03 కోట్లు వసూలు చేసింది. తద్వారా రెండు రాష్ట్రాల్లోనే ఈ మార్కును చేరుకున్న చిత్రాల జాబితాలో చేరింది.


Click it and Unblock the Notifications











