For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bimbisara 17 Days Collections: బింబిసారకు సండే లక్.. అప్పుడే అన్ని కోట్లా.. మరో 85 లక్షలు వస్తే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన కల్యాణ్ రామ్ ఒకడు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా తన సత్తాను నిరూపించుకునేందుకు అతడు వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ వస్తున్నాడు. అయితే, చాలా కాలంగా కల్యాణ్ భారీ సక్సెస్‌ను అందుకోవడంలో మాత్రం విఫలం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ నందమూరి హీరో ఇటీవలే 'బింబిసార' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'బింబిసార' 17 రోజుల రిపోర్టును మీరే చూడండి!

    ‘బింబిసార’గా ఎంటరైన కల్యాణ్

    ‘బింబిసార’గా ఎంటరైన కల్యాణ్

    నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'బింబిసార'. టైమ్ ట్రావెల్ కథతో వచ్చిన ఈ మూవీని మల్లిడి వశిష్ట తెరకెక్కించగా.. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో తీశారు. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేశారు. కీరవాణి సంగీతం అందించారు.

    Amit Shah With NTR: ఎన్టీఆర్, అమిత్ షా భేటీ సీక్రెట్ ఇదే.. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే!

    బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

    బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

    నందమూరి కల్యాణ్ రామ్ మార్కెట్‌కు అనుగుణంగా 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 15.60 కోట్లు బిజినెస్ అయింది.

    17వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

    17వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

    17వ రోజు ఏపీ, తెలంగాణలో 'బింబిసార' మూవీకి వసూళ్లు మరింతగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 34 లక్షలు, సీడెడ్‌లో రూ. 23 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలలో కలిపి రూ. 84 లక్షలు షేర్, రూ. 1.55 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    బికినీ సైజ్ తగ్గించిన పూనమ్ బజ్వా: వామ్మో ఇదేం దారుణం సామీ!

    17 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    17 రోజులకు కలిపి ఎంత వచ్చింది?


    'బింబిసార' మూవీకి 17 రోజులకు వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 11.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.37 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.66 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.87 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.38 కోట్లు, గుంటూరులో రూ. 2.13 కోట్లు, కృష్ణాలో రూ. 1.56 కోట్లు, నెల్లూరులో రూ. 89 లక్షలతో కలిపి రూ. 30.87 కోట్లు షేర్‌, రూ. 49.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 17 రోజుల్లో రూ. 30.87 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.28 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 17 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 35.35 కోట్లు షేర్‌తో పాటు రూ. 60.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ఊహించని విధంగా అనన్య నాగళ్ల హాట్ షో: ఈ వీడియోలో ఆమెను చూశారంటే!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    సోషియో ఫాంటసీ నేపథ్యంతో వచ్చిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, 17 రోజుల్లోనే ఈ సినిమాకు టోటల్‌గా రూ. 35.35 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 19.15 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

    మరో 85 లక్షలు వస్తే కల్యాణ్ రికార్డ్

    మరో 85 లక్షలు వస్తే కల్యాణ్ రికార్డ్

    నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో వచ్చిన 'బింబిసార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. అలాగే, ప్రపంచ వ్యాప్తంగానూ ఇది సత్తా చాటుతోంది. ఇక, ఈ సినిమాకు మరో రూ. 85 లక్షలు వస్తే.. ఏకంగా రూ. 20 కోట్ల లాభాలు వస్తాయి.

    English summary
    Nandamuri Kalyan Ram Now Did Bimbisara Movie Under Mallidi Vashist Direction. This Movie Collect 35.35 Cr in 17 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X