Bimbisara 18 Days Collections: కళ్యాణ్ రామ్ అస్సలు తగ్గట్లేదుగా.. అసలైన బాక్సాఫీస్ హిట్
నందమూరి హీరోలలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా వారి కంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకుని కొనసాగుతున్న సమయంలో కళ్యాణ్ రామ్ మాత్రం మొన్నటి వరకు సరైన సక్సెస్ లేక సతమతమయ్యాడు. ఇక మొత్తానికి తమ్ముడు, బాబాయ్ రేంజ్ లోనే కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో అసలైన సక్సెస్ అందుకున్నాడు. ఫాంటసీ యాక్షన్ సినిమాగా వచ్చిన ఈ మూవీ పెట్టిన పెట్టుబడికి మంచి ప్రాఫిట్స్ అందించింది. ఇక మొత్తంగా 18 రోజులలో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..

బింబిసార ప్రీ రిలీజ్ బిజినెస్
నందమూరి కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 15.60 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

18వ రోజు వచ్చిన కలెక్షన్స్
18వ రోజు ఏపీ, తెలంగాణలో 'బింబిసార' సినిమా కలెక్షన్స్ కొంత తగ్గాయి. ఇక నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 12 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్ష, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్ష.. మొత్తం కలిపి రూ. 38 లక్షలు షేర్, రూ. 65 లక్షల గ్రాస్ వసూలు అయింది.

18 రోజుల టోటల్ కలెక్షన్లు
'బింబిసార' మూవీకి 18 రోజులకు వసూళ్లు భారీగా వచ్చాయి. నైజాంలో రూ. 11.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.49 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.70 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.89 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.39 కోట్లు, గుంటూరులో రూ. 2.15 కోట్లు, కృష్ణాలో రూ. 1.58 కోట్లు, నెల్లూరులో రూ. 90 లక్షలతో కలిపి రూ. 31.25 కోట్లు షేర్, రూ. 49.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 17 రోజుల్లో రూ. 30.87 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.28 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 18 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 35.77 కోట్లు షేర్‌తో పాటు రూ. 60.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

లాభం ఎంతంటే?
'బింబిసార' మూవీకి అంచనాలకు తగ్గట్టుగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, 18 రోజుల్లోనే ఈ సినిమాకు టోటల్‌గా రూ. 35.77 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 19.57 కోట్లు లాభాలు కూడా దక్కాయి.


Click it and Unblock the Notifications











