Bimbisara 19 Days Collections: బింబిసార మరో సంచలన రికార్డు.. వామ్మో అన్ని కోట్లు ఏంటి సామీ!
నందమూరి కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు. అయితే, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. వారిలో కల్యాణ్ రామ్ ఒకడు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని స్టార్‌గా ఎదిగాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. అయితే, భారీ సక్సెస్‌లను మాత్రం అందిపుచ్చుకోలేకపోతోన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే కల్యాణ్ రామ్ 'బింబిసార' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'బింబిసార' 19 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

‘బింబిసార’గా కల్యాణ్ విశ్వరూపం
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో వచ్చిన చిత్రమే 'బింబిసార'. టైమ్ ట్రావెల్ కథతో వచ్చిన ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో తీశారు. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేశారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.

బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్
నందమూరి కల్యాణ్ రామ్ మార్కెట్ ప్రకారమే 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 15.60 కోట్లు బిజినెస్ జరిగింది.

19వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?
ఏపీ, తెలంగాణలో 19వ రోజు 'బింబిసార' మూవీకి వసూళ్లు మళ్లీ పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 16 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలలో కలిపి రూ. 43 లక్షలు షేర్, రూ. 75 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

19 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
19 రోజులకు 'బింబిసార' మూవీకి వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 11.31 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.63 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.75 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.92 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.40 కోట్లు, గుంటూరులో రూ. 2.17 కోట్లు, కృష్ణాలో రూ. 1.59 కోట్లు, నెల్లూరులో రూ. 91 లక్షలతో కలిపి రూ. 31.68 కోట్లు షేర్, రూ. 50.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 19 రోజుల్లో రూ. 31.68 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.24 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.31 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 19 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 36.23 కోట్లు షేర్‌తో పాటు రూ. 61.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?
టైం ట్రావెల్ కథతో రూపొందిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, 19 రోజుల్లోనే ఈ సినిమాకు టోటల్‌గా రూ. 36.23 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 20.03 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

20 కోట్లతో బింబిసార సంచలనం
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో వచ్చిన 'బింబిసార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. అలాగే, ప్రపంచ వ్యాప్తంగానూ ఇది సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి ఏకంగా రూ. 20 కోట్ల లాభాలతో సంచలన రికార్డు కొట్టింది.


Click it and Unblock the Notifications











