Bimbisara 2Days Collections: 2వ రోజు ఊహించని వసూళ్లు.. అప్పుడే అన్ని కోట్లు.. కల్యాణ్ రామ్ రికార్డ్

చాలా కాలం క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమైనా.. సుదీర్ఘమైన కెరీర్‌లో చాలా తక్కువ విజయాలనే అందుకున్నా.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. సుదీర్ఘ కాలంగా సరైన విజయం లేక ఇబ్బందులు పడుతోన్న ఈ హీరో.. ఈ సారి ఎలాగైనా భారీ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో 'బింబిసార' అనే సినిమాను చేశాడు. విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమా శుక్రవారమే ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు టాక్, కలెక్షన్లు అదిరిపోయేలా వచ్చాయి. ఈ నేపథ్యంలో 'బింబిసార' 2 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

 బింబిసారగా కల్యాణ్ రామ్ సందడి

బింబిసారగా కల్యాణ్ రామ్ సందడి


నందమూరి కల్యాణ్ రామ్ - మల్లిడి వశిష్ట కాంబోలో వచ్చిన సినిమానే 'బింబిసార'. టైమ్ ట్రావెల్ కథతో వచ్చిన ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించాడు. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలను పోషించారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్


నందమూరి కల్యాణ్ రామ్ మార్కెట్ ప్రకారమే 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 15.60 కోట్ల బిజినెస్ అయింది.

రెండో రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

రెండో రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?


ఆంధ్ర, తెలంగాణలో 'బింబిసార' మూవీకి 2వ రోజూ భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.77 కోట్లు, సీడెడ్‌లో రూ. 95 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 65 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 32 లక్షలు, కృష్ణాలో రూ. 25 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో కలిపి రూ. 4.52 కోట్లు షేర్, రూ. 7.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

2 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

2 రోజులకు కలిపి ఎంత వచ్చింది?


'బింబిసార' మూవీకి రెండు రోజుల్లోనూ భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 3.92 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.24 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.55 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 70 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు, గుంటూరులో రూ. 89 లక్షలు, కృష్ణాలో రూ. 59 లక్షలు, నెల్లూరులో రూ. 38 లక్షలతో కలిపి రూ. 10.82 కోట్లు షేర్, రూ. 17.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2 రోజుల్లో రూ. 10.82 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.05 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 12.37 కోట్లు షేర్‌తో పాటు రూ. 20.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

 బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


టైం ట్రావెల్ స్టోరీతో రూపొందిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లోనే దీనికి రూ. 12.37 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 3.83 కోట్లు రాబడితే ఇది క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

 కల్యాణ్ రామ్‌కు 1.. ఓవరాల్‌గా 4

కల్యాణ్ రామ్‌కు 1.. ఓవరాల్‌గా 4


'బింబిసార' మూవీ రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.52 కోట్లు షేర్ వసూలు చేసింది. తద్వారా కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు (రెండో రోజు) సాధించిన చిత్రంగా ఇది రికార్డు సాధించింది. అలాగే, టైర్ 2 హీరోల జాబితాలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రాల్లో నాలుగో స్థానానికి చేరింది. ఈ జాబితాలో 'లవ్ స్టోరి' రూ. 5.08 కోట్లతో మొదటి స్థానంలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X