For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bimbisara 2 Weeks Collections: 16 కోట్ల బిజినెస్.. 2 వారాల్లోనే అన్ని కోట్లు.. లాభమెంతో తెలిస్తే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది స్టార్ల వారసులు హీరోలుగా పరిచయం అవుతున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవడంతో పాటు బడా హీరోలుగా వెలుగొందుతోన్నారు. కానీ, ఇంకొందరు మాత్రం సరైన విజయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన కల్యాణ్ రామ్ ఒకడు. చాలా కాలంగా భారీ సక్సెస్ కోసం చూస్తోన్న అతడు.. ఇటీవలే 'బింబిసార' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు విశేషమైన స్పందన దక్కింది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఈ నేపథ్యంలో 'బింబిసార' 14 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

    బింబిసారగా కల్యాణ్ రామ్ సందడి

    బింబిసారగా కల్యాణ్ రామ్ సందడి

    నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో వచ్చిన చిత్రమే 'బింబిసార'. కీరవాణి దీనికి సంగీతం అందించారు. టైమ్ ట్రావెల్ కథతో వచ్చిన ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో తీశారు. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేశారు.

    విడాకుల తర్వాత సమంత రిస్క్: ఆ ప్రాపర్టీపై కన్ను.. ఎన్ని కోట్లు ఖర్చు చేస్తుందో తెలిస్తే!

    బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

    బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

    కల్యాణ్ రామ్ మార్కెట్‌‌కు అనుగుణంగా 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

    14వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

    14వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

    'బింబిసార' మూవీకి 14వ రోజు ఏపీ, తెలంగాణలో వసూళ్లు మరింత తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 11 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 80 వేలు, నెల్లూరులో రూ. 20 వేలతో కలిపి రూ. 29 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

    యాంకర్ శ్రీముఖి అందాల జాతర: ఆమెనిలా చూశారంటే చెమటలే

    14 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    14 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    2 వారాలకు 'బింబిసార' మూవీకి వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 10.28 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.82 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.46 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.76 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.32 కోట్లు, గుంటూరులో రూ. 2.03 కోట్లు, కృష్ణాలో రూ. 1.48 కోట్లు, నెల్లూరులో రూ. 85 లక్షలతో కలిపి రూ. 29.00 కోట్లు షేర్‌, రూ. 45.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2 వారాల్లో రూ. 29.00 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.06 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 14 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 33.26 కోట్లు షేర్‌తో పాటు రూ. 55.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

    హాట్ షోలో గీత దాటిన మెహ్రీన్: బికినీలో బీభత్సమైన ఫోజులు

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    టైం ట్రావెల్ కథతో వచ్చిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, 2 వారాల్లోనే దీనికి రూ. 33.26 కోట్లు వచ్చాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 17.06 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

    కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే ది బెస్ట్‌గా

    కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే ది బెస్ట్‌గా

    చాలా కాలంగా భారీ విజయం కోసం ఎదురు చూస్తోన్న నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఇది మంచిగానే రాణించింది. ఫలితంగా ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇలా ఇప్పటికే కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే ఇది అత్యధిక వసూళ్లను రాబట్టింది.

    English summary
    Nandamuri Kalyan Ram Now Did Bimbisara Movie Under Mallidi Vashist Direction. This Movie Collect 33.26 Cr in 2 Weeks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X