Bimbisara 20 Days Collections: బింబిసారకు భారీ షాక్.. తొలిసారి ఇంత తక్కువ.. కానీ లాభం మాత్రం!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలు కొందరే ఉన్నారు. అందులో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన కల్యాణ్ రామ్ ఒకడు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకుని విభిన్నమైన చిత్రాలతో వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే కల్యాణ్ రామ్ 'బింబిసార' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు మంచిగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'బింబిసార' 20 రోజుల రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

‘బింబిసార’గా కల్యాణ్ అరాచకం
నందమూరి కల్యాణ్ రామ్ - మల్లిడి వశిష్ట కలయికలో వచ్చిన సినిమానే 'బింబిసార'. సోషియో ఫాంటసీ జోనర్‌లో వచ్చిన ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో తీశారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేశారు.

బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్
కల్యాణ్ రామ్ మార్కెట్, అంచనాల ప్రకారమే 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 15.60 కోట్లు బిజినెస్ అయింది.

20వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?
20వ రోజు ఏపీ, తెలంగాణలో 'బింబిసార' మూవీకి వసూళ్లు భారీగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 80 వేలు, గుంటూరులో రూ. 80 వేలు, కృష్ణాలో రూ. 20 వేలు, నెల్లూరులో రూ. 20 వేలలో కలిపి రూ. 25 లక్షలు షేర్, రూ. 45 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

20 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
'బింబిసార' మూవీకి 20 రోజులకు వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 11.40 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.72 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.78 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.94 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.41 కోట్లు, గుంటూరులో రూ. 2.18 కోట్లు, కృష్ణాలో రూ. 1.59 కోట్లు, నెల్లూరులో రూ. 91 లక్షలతో కలిపి రూ. 31.93 కోట్లు షేర్, రూ. 50.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది
20 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 31.93 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.32 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 20 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 36.50 కోట్లు షేర్‌తో పాటు రూ. 62.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?
టైం ట్రావెల్ స్టోరీతో రూపొందిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, 20 రోజుల్లోనే ఈ సినిమాకు టోటల్‌గా రూ. 36.50 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 20.30 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

తొలిసారి ఇంత తక్కువ వసూళ్లు
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం 'బింబిసార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. అయితే, 20వ రోజు మాత్రం దీనికి వసూళ్లు భారీగా పడిపోయాయి. దీంతో తొలిసారి తక్కువగా రూ. 27 లక్షలే వసూలు అయ్యాయి.


Click it and Unblock the Notifications











