For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bimbisara 23 Days Collections: ఒక్కసారిగా వసూళ్లు డబుల్.. అయినా నిరాశగానే.. లాభాలు మాత్రం!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఈ కుటుంబం నుంచి ఎన్టీఆర్ తర్వాత ఎంతో మంది హీరోలుగా పరిచయం అవడమే. అయితే, వాళ్లలో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అందులో కల్యాణ్ రామ్ ఒకడు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అతడు.. వరుస సినిమాలతో సత్తా చాటుతోన్నాడు. ఈ క్రమంలోనే కల్యాణ్ రామ్ ఇటీవలే 'బింబిసార' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు.

    భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కుతోంది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'బింబిసార' మూవీ 23 రోజుల రిపోర్టును మీరే చూడండి!

     బింబిసారగా నందమూరి హీరో రచ్చ

    బింబిసారగా నందమూరి హీరో రచ్చ

    నందమూరి కల్యాణ్ రామ్ - మల్లిడి వశిష్ట కాంబోలో వచ్చిన సినిమానే 'బింబిసార'. సోషియో ఫాంటసీ జోనర్‌లో వచ్చిన ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో తీశారు. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేశారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చారు.

    Bigg Boss 6: సీజన్ ముందు బిగ్ బాస్‌కు షాక్.. చివరి నిమిషంలో ఇద్దరు బిగ్ స్టార్స్ ఔట్

    బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

    బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

    కల్యాణ్ రామ్ మార్కెట్‌‌, అంచనాల ప్రకారం 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 15.60 కోట్లు బిజినెస్ అయింది.

    23వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

    23వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

    సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందిన 'బింబిసార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా కలెక్షన్లు అత్యధికంగా వచ్చాయి. అయితే, కొన్ని రోజులుగా ఈ సినిమాకు వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. ఈ క్రమంలోనే 23వ రోజైన శనివారం కలెక్షన్లు కాస్త పెరిగాయి. దీంతో రూ. 19 లక్షలు షేర్, రూ. 40 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

    బట్టలు లేకుండా స్టార్ హీరోయిన్: డెలివరీ అయిన వెంటనే ఘోరంగా!

    23 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    23 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    'బింబిసార' మూవీకి 23 రోజులకు వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 11.52 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.83 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.82 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.96 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.44 కోట్లు, గుంటూరులో రూ. 2.21 కోట్లు, కృష్ణాలో రూ. 1.59 కోట్లు, నెల్లూరులో రూ. 93 లక్షలతో కలిపి రూ. 32.30 కోట్లు షేర్‌, రూ. 51.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

    23 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 32.30 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.28 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.34 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 23 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 36.92 కోట్లు షేర్‌తో పాటు రూ. 63.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

    బెడ్ మీద అమలా పాల్ అరాచకం: బాబోయ్ ఇదే దారుణం సామీ!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    టైం ట్రావెల్ కథతో రూపొందిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, 23 రోజుల్లోనే ఈ సినిమాకు టోటల్‌గా రూ. 36.92 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 20.72కోట్లు లాభాలు కూడా దక్కాయి.

    లైగర్ ఎఫెక్టుతో దానికంటే తక్కువ

    లైగర్ ఎఫెక్టుతో దానికంటే తక్కువ

    నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం 'బింబిసార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'లైగర్' మూవీ విడుదల తర్వాత కలెక్షన్లు భారీగా పడిపోయాయి. దీనికి కారణం నైజాం ఏరియాలో థియేటర్ల సంఖ్య తగ్గిపోవడమే. అందుకే 23వ రోజైన శనివారం దీనికి 'సీతా రామం' మూవీ కంటే చాలా తక్కువ కలెక్షన్లు వచ్చాయి.

    English summary
    Nandamuri Kalyan Ram Now Did Bimbisara Movie Under Mallidi Vashist Direction. This Movie Collect 36.92 Cr in 23 Days. నందమూరి కల్యాణ్ రామ్ ప్రస్తుతం బింబిసార అనే సినిమాను చేశాడు. మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 23 రోజుల్లోనే రూ. 36.92 కోట్లు వసూలు చేసింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X