Bimbisara 24 Days Collections: బింబిసారకు కలిసొచ్చిన సండే.. ఆ రికార్డు కొట్టిన కల్యాణ్ రామ్

పెద్ద సినీ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన హీరోనే అయినా.. ఆరంభంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు కల్యాణ్ రామ్. ఒకవైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ వ్యవహరించిన అతడు.. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో తనదైన మార్కును చూపిస్తూ ముందుకు వెళ్తోన్నాడు. అయితే, అంతగా విజయాలను సొంతం చేసుకోలేకపోతోన్న అతడు.. ఇటీవలే 'బింబిసార' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమాకు భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా ఈ చిత్రానికి వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'బింబిసార' మూవీ 24 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పడండి!

బింబిసారగా మారిన కల్యాణ్ రామ్

బింబిసారగా మారిన కల్యాణ్ రామ్

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రమే 'బింబిసార'. మల్లిడి వశిష్ట తీసిన ఈ సోషియో ఫాంటసీ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో కేథరిన్ థ్రెస్సా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేశారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.

బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

టైం ట్రావెల్ కథతో రూపొందిన 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 15.60 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ సమాచారం.

24వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

24వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

నందమూరి కల్యాణ్ రామ్ - వశిష్ట కాంబినేషన్‌లో రూపొందిన 'బింబిసార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా కలెక్షన్లు అత్యధికంగా వచ్చాయి. అయితే, కొన్ని రోజులుగా ఈ సినిమాకు వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. ఈ క్రమంలోనే 24వ రోజైన ఆదివారం కలెక్షన్లు భారీగా పెరిగి రూ. 31 లక్షలు షేర్, రూ. 60 లక్షలు గ్రాస్ వచ్చింది.

24 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

24 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

24 రోజులకు 'బింబిసార' మూవీకి వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 11.61 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.93 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.85 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.98 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.46 కోట్లు, గుంటూరులో రూ. 2.24 కోట్లు, కృష్ణాలో రూ. 1.59 కోట్లు, నెల్లూరులో రూ. 95 లక్షలతో కలిపి రూ. 32.61 కోట్లు షేర్‌, రూ. 52.20 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 24 రోజుల్లో రూ. 32.61 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.35 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 24 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 37.25 కోట్లు షేర్‌తో పాటు రూ. 63.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?


ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, 24 రోజుల్లోనే ఈ సినిమాకు టోటల్‌గా రూ. 37.25 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 21.05 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

మరో రికార్డును చేరుకున్న కల్యాణ్

మరో రికార్డును చేరుకున్న కల్యాణ్


నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం 'బింబిసార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విశేషమైన స్పందన వస్తోంది. అయితే, 'లైగర్' మూవీ విడుదల తర్వాత దీని కలెక్షన్లు భారీగా పడిపోయాయి. అయినప్పటికీ ఈ చిత్రం 24వ రోజు భారీగానే రాబట్టింది. ఈ క్రమంలోనే ఏకంగా రూ. 21 కోట్ల రూపాయల లాభాల మార్కును చేరుకుని రికార్డు సృష్టించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X