Don't Miss!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Bimbisara 25 Days Collections: ఒక్కసారిగా మళ్ళీ తగ్గిన బింబిసార కలెక్షన్స్.. ఇంతవరకు లాభం ఎంతంటే?
కళ్యాణ్ రామ్ నటించిన ఫాంటసీ యాక్షన్ మూవీ బింబిసార సినిమా అంచనాలకు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్లతో ఈ ఏడాది అత్యధిక లాభాలు అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది. కొత్త దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్స్ కు మంచి ప్రాఫిట్స్ అంధించాయి. ఇక 4వ వారంలో కూడా డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక 25వ రోజు ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే...
బింబిసార బిజినెస్
'బింబిసార' సినిమా నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 15.60 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ సమాచారం.
25వ రోజు ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్
నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్ లోనే 'బింబిసార' సినిమా అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవడమే కాకుండా చాలా వేగంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసింది. మూడు వారాల పాటు ఆడియెన్స్ హడావుడి తో కనిపించిన బాంబిసార థియేటర్లు 4వ వారంలో మాత్రం అనుకున్నంతగా కలెక్షన్లు పెంచుకోలేకపోయింది. ఇక 25వ రోజు సోమవారం 9 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.
25 రోజుల మొత్తం కలెక్షన్స్
25 రోజుల్లో 'బింబిసార' సినిమా ఏరియాల వారిగా అందుకున్న కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 11.63 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.97 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.86 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.99 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.46 కోట్లు, గుంటూరులో రూ. 2.25 కోట్లు, కృష్ణాలో రూ. 1.59 కోట్లు, నెల్లూరులో రూ. 95 లక్షలతో కలిపి రూ. 32.70 కోట్లు షేర్, రూ. 52.40 కోట్లు గ్రాస్ రాబట్టింది.
వరల్డ్ వైడ్ కలెక్షన్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 రోజుల్లో రూ. 32.70 కోట్లు కొల్లగొట్టిన 'బింబిసార' సినిమా ప్రపంచ వ్యాప్తంగానూ మంచి కలెక్షన్లు అందుకుంది. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.30 కోట్లు, ఓవర్సీస్లో రూ. 2.35 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 25 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 37.34 కోట్లు షేర్‌తో పాటు రూ. 63.91 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రాఫిట్ ఎంత?
'బింబిసార' సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో నిర్మించారు. ఇక మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగింది. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. 25 రోజుల్లోనే ఈ సినిమాకు టోటల్‌గా రూ. 37.34 కోట్లు వసూలు అయ్యాయి. ఇక సినిమా పెట్టిన పెట్టుబడులకు రూ. 21.14 కోట్లు లాభాలు వచ్చాయి.