Bimbisara 27 Days Collections: ఇంకాస్త పెరిగిన వసూళ్ళు.. బింబిసారతో మొత్తం లాభాలు ఎంతంటే?

ఫాంటసీ యాక్షన్ మూవీ బింబిసార బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి ఇప్పటికే డబుల్ ప్రాఫిట్స్ అందించి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక లాభాలను అందించిన సినిమాగా నిలిచింది. ఇక బుధవారం వినాయకచవితి పండగ సినిమాకు మంచి కలెక్షన్స్ అందించింది. కొత్త దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నిర్మాతకు అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కు మంచి లాభాలు అంధించింది. ఇక 27వ రోజు ఎంత కలెక్ట్ చేసింది ఇంతవరకు వచ్చిన మొత్తం లాభం ఎంత అనే వివరాల్లోకి వెళితే...

బింబిసార ప్రీ రిలీజ్ బిజినెస్

బింబిసార ప్రీ రిలీజ్ బిజినెస్


బింబిసార సినిమా నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 15.60 కోట్లు బిజినెస్ జరిగినట్లు సమాచారం.

 27వ రోజు నైజాం ఆంధ్ర కలెక్షన్స్

27వ రోజు నైజాం ఆంధ్ర కలెక్షన్స్

బింబిసార సినిమా మొదటి వారంలోనే నిర్మాతను ప్రాఫిట్ జోన్ లోకి తీసుకు వచ్చింది. నమ్మినట్లుగానే ఆడియెన్స్ సినిమాను ఫెస్టివల్ సీజన్స్ లో బాగానే ఆదరించారు. కంటెంట్ తోనే సినిమా సక్సెస్ అవుతుంది అని నిరూపించారు. ఇక మూడు వారాల పాటు ఆడియెన్స్ హడావుడి తో కనిపించిన బాంబిసార థియేటర్లు 4 వారంలో కాస్త డీసెంట్ కలెక్షన్లు వచ్చాయి. ఇక 27వ రోజు వినాయకచవితి ఉండడంతో 26వ రోజు కంటే కొంత పెరిగాయి. బుధవారం తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 12 లక్షల షేర్ దక్కింది.

 27 రోజుల టోటల్ కలెక్షన్స్

27 రోజుల టోటల్ కలెక్షన్స్


27 రోజుల్లో 'బింబిసార' సినిమా ఏరియాల వారిగా అందుకున్న టోటల్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 11.68 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.02 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.89 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.00 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.47 కోట్లు, గుంటూరులో రూ. 2.25 కోట్లు, కృష్ణాలో రూ. 1.59 కోట్లు, నెల్లూరులో రూ. 96 లక్షలతో కలిపి టోటల్ గా రూ. 32.86 కోట్లు షేర్‌, రూ. 52.75 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్

ఇక 27 రోజుల్లో రూ. 32.86 కోట్లు అందుకున్న 'బింబిసార' సినిమా ప్రపంచ వ్యాప్తంగానూ మంచి కలెక్షన్లు అందుకుంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.31 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.36 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 27 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 37.53 కోట్లు షేర్‌తో పాటు రూ. 64.30 కోట్లు గ్రాస్ అందుకుంది.

 లాభం ఎంతంటే?

లాభం ఎంతంటే?


బింబిసార చిత్ర యూనిట్ కష్టానికి తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రాఫిట్స్ అందించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ చేసిన బింబిసార 16.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఫైనల్ గా 27 రోజుల్లోనే ఈ సినిమా టోటల్‌గా రూ. 37.54 కోట్లు అందుకొని.. పెట్టిన పెట్టుబడులకు రూ. 21.33 కోట్ల లాభాలు అందుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X