Bimbisara 3 Days Collections: 3వ రోజు ఊచకోత.. అన్ని కోట్ల టార్గెట్ ఫినీష్.. లాభం ఎన్ని కోట్లంటే!
నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతోన్నాడు కల్యాణ్ రామ్. దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్నా.. అతడు కేవలం మూడు, నాలుగు హిట్లను మాత్రమే సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ సారి కచ్చితంగా భారీ విజయాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో 'బింబిసార' అనే వైవిధ్యమైన సినిమాను చేశాడు. ఆరంభంలోనే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ మూవీ.. గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అందుకు అనుగుణంగానే దీనికి పాజిటివ్ టాక్, అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'బింబిసార' 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

బింబిసారగా కల్యాణ్ రామ్ ఎంట్రీ
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట రూపొందించిన సినిమానే 'బింబిసార'. టైమ్ ట్రావెల్ కథతో వచ్చిన ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించాడు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలను పోషించారు.

బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్
కల్యాణ్ రామ్ మార్కెట్‌కు అనుగుణంగానే 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 15.60 కోట్ల బిజినెస్ అయింది.

మూడో రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
'బింబిసార' మూవీకి ఆంధ్ర, తెలంగాణలో 3వ రోజూ వసూళ్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.16 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 74 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 33 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 38 లక్షలు, కృష్ణాలో రూ. 30 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో కలిపి రూ. 5.02 కోట్లు షేర్, రూ. 8.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

3 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
'బింబిసార' మూవీకి మూడు రోజులకి కలిపి భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.72 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.40 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.29 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.03 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 74 లక్షలు, గుంటూరులో రూ. 1.27 కోట్లు, కృష్ణాలో రూ. 89 లక్షలు, నెల్లూరులో రూ. 50 లక్షలతో కలిపి రూ. 15.84 కోట్లు షేర్, రూ. 24.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది
3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 15.84 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.35 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 18.29 కోట్లు షేర్‌తో పాటు రూ. 30.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?
క్రేజీ సబ్జెక్టుతో రూపొందిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లోనే దీనికి రూ. 18.29 కోట్లు వచ్చాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.09 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే టాప్ ప్లేస్
'బింబిసార' మూవీకి మూడు రోజుల్లోనే రూ. 18.29 కోట్లు షేర్ వసూలు అయింది. దీంతో కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. గతంలో ఈ రికార్డు 'పటాస్' (16.45 కోట్లు) పేరిట ఉండేది. ఇప్పుడు దాన్ని మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ చేసింది. అలాగే, 3వ రోజు ఎక్కువ వసూలు చేసిన టైర్ 2 హీరోల చిత్రాల్లో ఇది రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో లవ్ స్టోరి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.


Click it and Unblock the Notifications











