twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bimbisara 3 Weeks Collections: 16 కోట్ల టార్గెట్.. 3 వారాల్లోనే అన్ని కోట్లా.. లాభాలతోనూ రికార్డే

    |

    నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన టాలెంట్లను చూపిస్తూ చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న హీరో కల్యాణ్ రామ్. కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసిన అతడు.. కొంత కాలంగా వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దీంతో సత్ఫలితాలను అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే కల్యాణ్ రామ్ 'బింబిసార' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కుతోంది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'బింబిసార' మూవీ 3 వారాల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

    బింబిసారగా కల్యాణ్ విశ్వరూపం

    బింబిసారగా కల్యాణ్ విశ్వరూపం

    నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట తీసిన సినిమానే 'బింబిసార'. సోషియో ఫాంటసీ జోనర్‌లో వచ్చిన ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో తీశారు. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేశారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.

    ఘోరమైన ఫొటోలు వదిలిన హీరోయిన్: ఏం చూపించకూడదో అవే చూపిస్తూ!ఘోరమైన ఫొటోలు వదిలిన హీరోయిన్: ఏం చూపించకూడదో అవే చూపిస్తూ!

    బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

    బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

    కల్యాణ్ రామ్ మార్కెట్‌‌కు అనుగుణంగానే 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 15.60 కోట్లు బిజినెస్ జరిగింది.

    21వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

    21వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?


    ఏపీ, తెలంగాణలో 21వ రోజు 'బింబిసార' మూవీకి వసూళ్లు భారీగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 2 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 20 వేలు, నెల్లూరులో రూ. 80 వేలతో కలిపి రూ. 10 లక్షలు షేర్, రూ. 20 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

    దారుణమైన ఫొటోతో షాకిచ్చిన దిశా పటానీ: ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!దారుణమైన ఫొటోతో షాకిచ్చిన దిశా పటానీ: ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

    3 వారాలకు కలిపి ఎంత వచ్చింది?

    3 వారాలకు కలిపి ఎంత వచ్చింది?

    'బింబిసార' మూవీకి 3 వారాలకు వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 11.42 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.75 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.79 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.95 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.42 కోట్లు, గుంటూరులో రూ. 2.19 కోట్లు, కృష్ణాలో రూ. 1.59 కోట్లు, నెల్లూరులో రూ. 92 లక్షలతో కలిపి రూ. 32.03 కోట్లు షేర్‌, రూ. 51.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

    3 వారాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 32.03 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.26 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.33 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 21 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 36.62 కోట్లు షేర్‌తో పాటు రూ. 62.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

    Liger: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు అషు రెడ్డి షాక్.. ఆ పని మాత్రం చేయకండి అంటూ!Liger: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు అషు రెడ్డి షాక్.. ఆ పని మాత్రం చేయకండి అంటూ!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?


    సోషియో ఫాంటసీ నేపథ్యంతో రూపొందిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.21 కోట్లుగా నమోదైంది. ఇక, 21 రోజుల్లోనే ఈ సినిమాకు టోటల్‌గా రూ. 36.62 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 20.42 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

    లైగర్ ఎఫెక్టుతో తక్కువ వసూళ్లు

    లైగర్ ఎఫెక్టుతో తక్కువ వసూళ్లు


    కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం 'బింబిసార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. అయితే, 21వ రోజు మాత్రం తొలిసారి తక్కువగా రూ. 10 లక్షలే వసూలు అయ్యాయి. దీనికి కారణం లైగర్ మూవీ రావడమే అని చెప్పొచ్చు.

    English summary
    Nandamuri Kalyan Ram Now Did Bimbisara Movie Under Mallidi Vashist Direction. This Movie Collect 36.62 Cr in 3 Weeks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X