Bimbisara 4 Weeks Collections: 16 కోట్ల టార్గెట్.. 4 వారాల్లో రికార్డు వసూళ్లు.. లాభాలతో మరో ఘనత
సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు వెళ్తోన్నాడు నందమూరి హీరో కల్యాణ్ రామ్. పెద్ద కుటుంబ నేపథ్యం ఉన్నా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అతడు.. నిర్మాతగానూ మారి ఎన్నో చిత్రాలను అందించాడు. అయితే, వ్యక్తిగతంగా మాత్రం అతడు భారీ సక్సెస్‌లను మాత్రం ఖాతాలో వేసుకోలేకపోతున్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లో కల్యాణ్ రామ్ ఇటీవలే 'బింబిసార' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీకి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వచ్చాయి. దీంతో దీనికి లాభాలు కూడా చాలానే దక్కాయి. ఈ నేపథ్యంలో 'బింబిసార' మూవీ 4 వారాల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పడండి!

బింబిసారగా ఎంటరైన కల్యాణ్ రామ్
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట తెరకెక్కించిన సినిమానే 'బింబిసార'. ఈ సోషియో ఫాంటసీ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. ఇందులో కేథరిన్ థ్రెస్సా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేశారు.

బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్
క్రేజీ సబ్జెక్టుతో రూపొందిన 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 15.60 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల టాక్.

28వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?
కల్యాణ్ రామ్ - వశిష్ట కాంబినేషన్‌లో రూపొందిన సోషియో ఫాంటసీ చిత్రం 'బింబిసార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా కలెక్షన్లు అత్యధికంగా వచ్చాయి. అయితే, కొన్ని రోజులుగా ఈ సినిమాకు వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. ఈ క్రమంలోనే 28వ రోజు మరింత తగ్గి కేవలం రూ. 8 లక్షలు షేర్, రూ. 15 లక్షలు గ్రాస్ వచ్చింది.

4 వారాలకు కలిపి ఎంత వచ్చింది?
4 వారాలకు 'బింబిసార' మూవీకి వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 11.71 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.03 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.90 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.01 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.48 కోట్లు, గుంటూరులో రూ. 2.26 కోట్లు, కృష్ణాలో రూ. 1.59 కోట్లు, నెల్లూరులో రూ. 96 లక్షలతో కలిపి రూ. 32.94 కోట్లు షేర్, రూ. 52.90 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4 వారాల్లో రూ. 32.94 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.32 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.36 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 28 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 37.62 కోట్లు షేర్‌తో పాటు రూ. 64.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?
టైం ట్రావెల్ కథతో తెరకెక్కిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, 4 వారాల్లోనే ఈ సినిమాకు టోటల్‌గా రూ. 37.62 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 21.42 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.


Click it and Unblock the Notifications











