twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bimbisara 6 Days Collections: 6వ రోజూ అరాచకమే.. కానీ సగం కలెక్షన్లు డౌన్.. టోటల్ లాభమెంతో తెలిస్తే!

    |

    నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు కల్యాణ్ రామ్. సుదీర్ఘమైన కెరీర్‌లో చాలా సినిమాలు చేసినా.. విజయాలను మాత్రం అంతగా అందుకోలేకపోయాడు. అయినప్పటికీ ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఇలా సుదీర్ఘ కాలంగా నటుడిగా, నిర్మాతగా సత్తా చాటుతోన్నాడు. ఈ క్రమంలోనే కల్యాణ్ రామ్ ఇటీవలే 'బింబిసార' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం భారీ స్పందనను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో 'బింబిసార' 6వ రోజు కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ రిపోర్టును చూద్దాం పదండి!

    బింబిసారగా నందమూరి హీరో రచ్చ

    బింబిసారగా నందమూరి హీరో రచ్చ

    నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట తెరకెక్కించిన ఫాంటసీ చిత్రమే 'బింబిసార'. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలను పోషించారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. టైమ్ ట్రావెల్ కథతో వచ్చిన ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించాడు.

    శ్రీయ అందాల ఆరబోత: తల్లయ్యాక కూడా ఇంత హాట్‌గానా!శ్రీయ అందాల ఆరబోత: తల్లయ్యాక కూడా ఇంత హాట్‌గానా!

    బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

    బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్


    కల్యాణ్ రామ్ మార్కెట్‌‌కు అనుగుణంగా 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ అయింది.

    ఆరో రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    ఆరో రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?


    'బింబిసార' మూవీకి 6వ రోజు ఆంధ్ర, తెలంగాణలో వసూళ్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 35 లక్షలు, సీడెడ్‌లో రూ. 23 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 24 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి రూ. 1.07 కోట్లు షేర్, రూ. 1.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

    Laal Singh Chaddha Twitter Review: రిలీజ్ రోజే అమీర్‌కు షాక్.. సినిమా టాక్ ఇలా.. నాగ చైతన్య మాత్రం!Laal Singh Chaddha Twitter Review: రిలీజ్ రోజే అమీర్‌కు షాక్.. సినిమా టాక్ ఇలా.. నాగ చైతన్య మాత్రం!

    6 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    6 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    6 రోజులకి కలిపి 'బింబిసార' మూవీకి భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 7.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.81 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.22 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.38 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.00 కోట్లు, గుంటూరులో రూ. 1.63 కోట్లు, కృష్ణాలో రూ. 1.18 కోట్లు, నెల్లూరులో రూ. 67 లక్షలతో కలిపి రూ. 21.69 కోట్లు షేర్‌, రూ. 34.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 6 రోజుల్లో రూ. 21.69 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.75 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఆరు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 24.84 కోట్లు షేర్‌తో పాటు రూ. 41.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ఆగిపోయిన హీరోయిన్ పూర్ణ పెళ్లి: క్లారిటీ ఇస్తూ ఇన్‌స్టా పోస్ట్.. ఆ ఫొటో షేర్ చేయడంతో!ఆగిపోయిన హీరోయిన్ పూర్ణ పెళ్లి: క్లారిటీ ఇస్తూ ఇన్‌స్టా పోస్ట్.. ఆ ఫొటో షేర్ చేయడంతో!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    ఫాంటసీ జోనర్‌లో రూపొందిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లోనే దీనికి రూ. 24.84 కోట్లు వచ్చాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 8.64 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

    పడిపోయిన సగానికి సగం కలెక్షన్లు

    పడిపోయిన సగానికి సగం కలెక్షన్లు

    'బింబిసార' మూవీకి 5వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 2.52 కోట్లు షేర్ వసూలు అయింది. కానీ, 6వ రోజు మాత్రం రూ. 1.07 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే సగం కంటే ఎక్కువగానే కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. అయినప్పటికీ ఈ సినిమాకు కోటి పైగానే వసూళ్లు రావడంతో చిత్ర యూనిట్ ఖుషీగా ఉంది. రాఖీ పండగకు, వీకెండ్‌కు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

    English summary
    Nandamuri Kalyan Ram Now Did Bimbisara Movie Under Mallidi Vashist Direction. This Movie Collect 24.84 Cr in 6 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X