For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bimbisara 9 Days Collections: 9వ రోజూ దాటేసి.. నితిన్‌కు పోటీ ఇచ్చే వసూళ్లు.. టోటల్ ఎంతో తెలిస్తే!

    |

    పేరున్న ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైనా.. ఆరంభంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. అయితే, సుదీర్ఘమైన ప్రయాణంలో ఆయన ఎన్నో చిత్రాల్లో నటించినా.. విజయాలను మాత్రం చాలా తక్కువగానే అందుకున్నాడు. దీంతో చాలా కాలంగా భారీ హిట్ కోసం వేచి చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కల్యాణ్ రామ్ ఇటీవలే 'బింబిసార' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ భారీ స్పందన వస్తోంది. ఫలితంగా కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'బింబిసార' 9 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి మరి!

    బింబిసారగా కల్యాణ్ రామ్ సందడి

    బింబిసారగా కల్యాణ్ రామ్ సందడి

    నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట తెరకెక్కించిన చిత్రమే 'బింబిసార'. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలను పోషించారు. టైమ్ ట్రావెల్ కథతో వచ్చిన ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కీరవాణి దీనికి సంగీతం అందించారు.

    ఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ: అందాలన్నీ కనిపించడంతో ఇబ్బంది

    బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

    బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

    కల్యాణ్ రామ్ మార్కెట్‌కు అనుగుణంగానే 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ అయింది.

    9వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

    9వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

    9వ రోజు 'బింబిసార' మూవీకి ఏపీ, తెలంగాణలో వసూళ్లు మరింత పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 39 లక్షలు, సీడెడ్‌లో రూ. 34 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 19 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి రూ. 1.14 కోట్లు షేర్, రూ. 1.82 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న ఫొటోలతో సంచలనం

    9 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    9 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    'బింబిసార' మూవీకి 9 రోజులకి కలిపి వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 8.79 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.64 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.69 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.53 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.13 కోట్లు, గుంటూరులో రూ. 1.78 కోట్లు, కృష్ణాలో రూ. 1.29 కోట్లు, నెల్లూరులో రూ. 74 లక్షలతో కలిపి రూ. 24.59 కోట్లు షేర్‌, రూ. 38.67 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 9 రోజుల్లో రూ. 24.59 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.58 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.93 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే తొమ్మిది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 28.10 కోట్లు షేర్‌తో పాటు రూ. 46.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ఫ్లైట్‌లోనే నయనతార - విఘ్నేష్ రచ్చ: భర్త మీద కూర్చుని.. ఏకంగా అక్కడ ముద్దు పెట్టేసి!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    ఫాంటసీ జోనర్‌లో వచ్చిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లోనే దీనికి రూ. 28.10 కోట్లు వచ్చాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 11.90 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

    ఆ మార్కును దాటేసిన బింబిసార

    ఆ మార్కును దాటేసిన బింబిసార

    'బింబిసార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. అదే సమయంలో ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్సే దక్కుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా అక్కడ 500K డాలర్లను (హాఫ్ మిలియన్) వసూలు చేసింది. తద్వారా కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా బింబిసార మరో రికార్డును కొట్టేసింది.

    English summary
    Nandamuri Kalyan Ram Now Did Bimbisara Movie Under Mallidi Vashist Direction. This Movie Collect 28.10 Cr in 9 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X