Bimbisara Total Collections: 16 కోట్ల టార్గెట్.. ఫుల్‌ రన్‌లో అన్ని కోట్లు.. లాభం ఎంతో తెలిస్తే!

పేరుకు నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరోనే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని వరుస సినిమాలతో అలరిస్తున్నాడు కల్యాణ్ రామ్. సుదీర్ఘ కాలంగా విభిన్నమైన చిత్రాలతో సందడి చేస్తోన్న అతడు.. ఫలితాలతో సంబంధం లేకుండా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఇలా ఇటీవలే ఈ నందమూరి హీరో 'బింబిసార' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి టాక్‌కు అనుగుణంగానే కలెక్షన్లు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో 'బింబిసార' మూవీ ఫుల్ రన్‌లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

బింబిసారగా కల్యాణ్ రామ్ రచ్చ

బింబిసారగా కల్యాణ్ రామ్ రచ్చ

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట రూపొందించిన సినిమానే 'బింబిసార'. ఈ సోషియో ఫాంటసీ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. ఇందులో కేథరిన్ థ్రెస్సా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.

బింబిసార ప్రీ బిజినెస్ డీటేల్స్

బింబిసార ప్రీ బిజినెస్ డీటేల్స్

టైం ట్రావెల్ కాన్సెప్టుతో వచ్చిన 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 15.60 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల టాక్.

పాజిటివ్ టాక్... కలెక్షన్ల సునామీ

పాజిటివ్ టాక్... కలెక్షన్ల సునామీ

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రం 'బింబిసార'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విశేషమైన స్పందన దక్కింది. దీంతో కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. అదే ప్రపంచ వ్యాప్తంగానూ ప్రభావాన్ని చూపించింది. దీంతో అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా కలెక్షన్లు సునామీ సృష్టించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది?

తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది?

'బింబిసార' మూవీకి ఫుల్ రన్‌లో వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 11.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.10 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.91 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.01 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.47 కోట్లు, గుంటూరులో రూ. 2.26 కోట్లు, కృష్ణాలో రూ. 1.60 కోట్లు, నెల్లూరులో రూ. 96 లక్షలతో కలిపి రూ. 33.16 కోట్లు షేర్‌, రూ. 53.35 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫుల్ రన్‌లో రూ. 33.16 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.36 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.40 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 37.92 కోట్లు షేర్‌తో పాటు రూ. 65.20 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

టైం ట్రావెల్ కథతో తెరకెక్కిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, ముగింపు సమయానికి ఈ సినిమాకు రూ. 37.92 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 21.72 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

ఆ ఓటీటీలో రాబోతున్న సినిమా

ఆ ఓటీటీలో రాబోతున్న సినిమా

సూపర్ హిట్ టాక్‌తో థియేటర్లలో చాలా రోజుల పాటు సందడి చేసిన 'బింబిసార' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి చాలా రకలా వార్తలు వైరల్ అవుతూనే వచ్చాయి. కానీ, రెండు నెలలు దాటినా దీన్ని స్ట్రీమింగ్ చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. దీన్ని అక్టోబర్ 21వ తేదీ నుంచి జీ5లో ప్రసారం చేయబోతున్నట్లు ప్రకటన వచ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X