twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bimbisara Collections: చరిత్ర సృష్టించిన బింబిసార.. ఒక్కచోటే 8 కోట్లతో సరికొత్త రికార్డు

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో విభిన్నమైన సబ్జెక్టులతో సినిమాలు వస్తున్నాయి. వాటికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తుండడంతో దర్శక నిర్మాతలు, హీరోలు ధైర్యంగా ముందుకు వచ్చి అలాంటి సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే నందమూరి కల్యాణ్ రామ్ సోషియో ఫాంటసీ జోనర్‌లో చేసిన చిత్రమే 'బింబిసార'. టైం ట్రావెల్ అనే అంశాన్ని జోడించి తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ దీనికి విశేషమైన స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ చిత్రం సీడెడ్ ఏరియాలో దుమ్ముదులిపే కలెక్షన్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో 'బింబిసార' 29 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

    బింబిసారగా వచ్చేసిన కల్యాణ్ రామ్

    బింబిసారగా వచ్చేసిన కల్యాణ్ రామ్

    నందమూరి కల్యాణ్ రామ్ - మల్లిడి వశిష్ట తెరకెక్కించిన సినిమానే 'బింబిసార'. ఈ సోషియో ఫాంటసీ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో కేథరిన్ థ్రెస్సా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేశారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చారు.

    వేణు మాధవ్ మరణంపై పెదవి విప్పిన కొడుకులు: ఆయనకు గర్ల్‌ఫ్రెండ్ ఎక్కువ.. అదే ప్రాణం తీసిందంటూ!వేణు మాధవ్ మరణంపై పెదవి విప్పిన కొడుకులు: ఆయనకు గర్ల్‌ఫ్రెండ్ ఎక్కువ.. అదే ప్రాణం తీసిందంటూ!

    బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

    బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

    టైం ట్రావెల్ స్టోరీతో వచ్చిన 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 15.60 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

    29వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

    29వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

    నందమూరి కల్యాణ్ రామ్ - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రూపొందిన సోషియో ఫాంటసీ చిత్రం 'బింబిసార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా కలెక్షన్లు అత్యధికంగా వచ్చాయి. అయితే, ఈ సినిమాకు వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. ఈ క్రమంలోనే 29వ రోజు మరింత తగ్గి కేవలం రూ. 6 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది.

    ప్రియాంక చోప్రా ఎద అందాల ఆరబోత: బటన్స్ విప్పేసి మరీ హాట్ షోప్రియాంక చోప్రా ఎద అందాల ఆరబోత: బటన్స్ విప్పేసి మరీ హాట్ షో

    29 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    29 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    29 రోజులకు 'బింబిసార' మూవీకి వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 11.73 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.05 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.91 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.01 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.48 కోట్లు, గుంటూరులో రూ. 2.26 కోట్లు, కృష్ణాలో రూ. 1.59 కోట్లు, నెల్లూరులో రూ. 96 లక్షలతో కలిపి రూ. 33.00 కోట్లు షేర్‌, రూ. 53.00 కోట్లు గ్రాస్ రాబట్టింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 29 రోజుల్లో రూ. 33.00 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.32 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.36 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 29 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 37.68 కోట్లు షేర్‌తో పాటు రూ. 64.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

    బట్టలు లేకుండా చరణ్ హీరోయిన్: ఆ పార్టును మాత్రమే చూపిస్తూ దారుణంగా!బట్టలు లేకుండా చరణ్ హీరోయిన్: ఆ పార్టును మాత్రమే చూపిస్తూ దారుణంగా!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    సోషియో ఫాంటసీ జోనర్‌లో వచ్చిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, 29 రోజుల్లోనే ఈ సినిమాకు టోటల్‌గా రూ. 37.68 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 21.48 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

     2 కోట్లుకు కొంటే.. 8 కోట్లు వసూళ్లు

    2 కోట్లుకు కొంటే.. 8 కోట్లు వసూళ్లు

    క్రేజీ సబ్జెక్టుతో వచ్చిన 'బింబిసార' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ విశేషమైన స్పందన దక్కింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా సీడెడ్ (రాయలసీమ)లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఫలితంగా అక్కడ రూ. 2 కోట్లకు హక్కులు అమ్ముడవగా.. ఇప్పటి వరకూ రూ. 8.05 కోట్లు వసూలు అయ్యాయి. అంటే.. ఇది ఏకంగా నాలుగు రెట్లు వసూళ్లతో చరిత్ర సృష్టించింది.

    English summary
    Nandamuri Kalyan Ram Now Did Bimbisara Movie Under Mallidi Vashist Direction. This Movie Collect 8.05 Cr in Ceded Area.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X