Bimbisara: ఏకంగా అన్ని థియేటర్లలో బింబిసారా.. నందమూరి హీరో నయా రికార్డు

నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. కెరీర్ ఆరంభంలోనే తనదైన టాలెంట్‌తో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని పెద్ద హీరోగా ఎదిగిపోయాడు కల్యాణ్ రామ్. హీరోగా పరిచయమైన కొత్తలోనే కమర్షియల్ చిత్రాలతో ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న అతడు.. పలు విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకున్న కల్యాణ్ రామ్.. వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నాడు. దీంతో నటుడిగానూ ఎంతో మెరుగుపడుతున్నాడు. కొంత కాలంగా సరైన బ్రేక్ కోసం వేచి చూస్తోన్న ఈ నందమూరి హీరో.. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి ఎన్నో భారీ చిత్రాలను చేస్తున్నాడు.

చాలా కాలంగా భారీ హిట్ కోసం వేచి చూస్తోన్న నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రమే 'బింబిసారా'. మల్లిడి వశిష్ట అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా.. టైం ట్రావెల్ కథతో విజువల్ వండర్‌గా రాబోతుంది. వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, మధ్యలో కొన్ని అవాంతరాల వల్ల చిత్రీకరణను బ్రేక్‌లు పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీలు చిక్కినప్పుడల్లా దీన్ని శరవేగంగా జరుపుతూ వచ్చారు. ఇలా ఈ సినిమాను కొద్ది రోజుల క్రితమే విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అంతేకాదు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం చేసేశారు.

Kalyan Ram Bimbisara Movie Worldwide Total Theaters Count

నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన 'బింబిసారా' మూవీ సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతుంది. బింబిసారుడు అనే క్రూరమైన రాజు.. టైం ట్రావెల్ చేసి ప్రస్తుత కాలానికి రావడం.. ఇక్కడి పరిస్థితులు చూసి ఆయనలో పరివర్తన రావడం అనే నేపథ్యంతో ఈ సినిమా రూపొందింది. ఇక, కాంబినేషన్‌లో రూపొందిన ఈ మూవీ ఆగస్టు 5న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు చేసింది. అలాగే, ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసుకున్నారు. ఇక, గురువారం సాయంత్రమే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'బింబిసారా' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని బిజినెస్ భారీ మొత్తంలో జరిగింది. ఇక, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని నైజాంలో 232, సీడెడ్‌లో 130, ఆంధ్రాలో 320 వరకూ అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 685 నుంచి 700 థియేటర్లలో విడుదల అవుతోంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 80, ఓవర్సీస్‌లో 210 థియేటర్లలో రాబోతుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 975 నుంచి 1000 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అంటే ఈ సినిమా నందమూరి కల్యాణ్‌ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన సోషియో ఫాంటసీ మూవీనే 'బింబిసారా'. మల్లిడి వశిష్ట అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించాడు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X