twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bimbisara నైజాం హక్కులను దక్కించుకున్న దిల్ రాజు.. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్ డీల్!

    |

    నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా ఆగస్టు 5వ తేదీన విడుదల పంపుతున్న విషయం తెలిసిందే. ఫాంటసీ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా సినిమా ట్రైలర్ ఒక్కసారిగా భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేసింది. కళ్యాణ్ రామ్ మొదటి సారి చేస్తున్న ఈ ప్రయోగంతో తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంటాడు అనే వాతావరణం కనిపిస్తుంది.

    అయితే బింబిసార విడుదలకు సిద్ధం అవడంతో ప్రస్తుతం బిజినెస్ డీల్స్ మాట్లాడుకోవడంలో నిర్మాతలు బిజీగా ఉన్నారు. ఇక కళ్యాణ్ రామ్ తన కెరీర్ లోనే భారీ స్థాయిలో ఈ సినిమా ద్వారా బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు కళ్యాణ్ రూమ్ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా 20 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా అందుకోలేదు. కానీ ఈ సినిమా అంతకంటే ఎక్కువ స్థాయిలో బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది.

    Kalyan Ram new movie Bimbisara Nizam Rights by DilRaju for solid deal

    ఎప్పుడు కూడా కళ్యాణ్ రామ్ సినిమాలు నైజంలో ఆ స్థాయిలో బిజినెస్ చేయలేదు. ఇక ఇప్పుడు దిల్ రాజు అయితే బింబిసార మీద ఉన్న నమ్మకంతో దాదాపు 5.60 కోట్ల వరకు ఖర్చు చేసి దక్కించుకున్నట్లు సమాచారం. తప్పకుండా బింబిసార నైజాంలో కూడా మంచి కలెక్షన్స్ అందుకుంటుంది అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అయితే యూట్యూబ్లో మంచి వ్యూవ్స్ అందుకుంది. దీంతో సినిమాకు ఓపెనింగ్స్ కూడా గట్టిగానే వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

    కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాలో రెండు పాత్రలలో కనిపించబోతున్నాడు. ఇక హీరోయిన్ గా కేథరిన్ ట్రెసా నటించగా మరొక ముఖ్యమైన పాత్రలో సంయుక్త మీనన్ కనిపించబోతోంది. ఈ సినిమాను కొత్త దర్శకుడు వశిష్ట్ కి తెరపైకి తీసుకు వచ్చాడు. ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన పనులన్నీ కూడా పూర్తయిపోయాయి. బింబిసార సినిమాను ఆగస్టు 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. మరి బిబిసారా సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

    English summary
    Kalyan Ram new movie Bimbisara Nizam Rights by DilRaju for solid deal..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X