Bimbisara day 4 Collections బాక్సాఫీస్ వద్ద కల్యాణ్ రామ్ మూవీ దూకుడు.. నాలుగో రోజు ఎంతంటే?
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు వశిష్ట డైరెక్షన్‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై రూపొందిన బింబిసార చిత్రం బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకెళ్తున్నది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం ఓ రికార్డుగా మారింది. అయితే సోమవారం ఏ సినిమాకైనా అగ్ని పరీక్షగా మారే సోమవారం కూడా బింబిసార చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం నాలుగో రోజున ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందంటే..

ఏ రేంజ్ హిట్ అంటే..
ఇక బింబిసార సక్సెస్ మీట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ.. మూడో రోజుకే బ్రేక్ ఈవెన్ సాధించిన చిత్రాలు అరుదు. అలాంటి రికార్డును బింబిసార చిత్రం సాధించింది. ఈ సినిమా రిలీజ్‌కు 15 రోజుల ముందు నేను సినిమా చూశాను. సినిమా చూసినప్పుడే గట్టిగా కొడుతుందని అనుకొన్నాను. కానీ ఏ రేంజ్‌లో హిట్ అవుతుందనే విషయంపై అంచనా వేయలేకపోయాను. ఇంత పెద్ద విజయం సాధిస్తుందని అనుకోలేదని దిల్ రాజు అన్నాడు.

మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్
ఇక బింబిసార చిత్రం ఇప్పటికే భారీ వసూళ్లను నమోదు చేసింది. తొలి రోజు 7.27 కోట్లు, రెండో రోజు 5.10 కోట్లు, మూడో రోజు 5.92 కోట్లు సాధించిన ఈ చిత్రం నాలుగో రోజు కూడా అదే ఊపును కొనసాగించింది. మూడు రోజుల్లో 18.29 కోట్ల షేర్, 30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

అమెరికాలో కలెక్షన్ల ప్రవాహం
అమెరికాలో బింబిసార సినిమాకు మంచి స్పందన లభిస్తున్నది. ఈ చిత్రం గత మూడు రోజుల్లో 350K డాలర్లను గ్రాస్ వసూళ్లను సాధించింది. వారాంతం వరకు ఈ చిత్రం 500K డాలర్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఓవర్సీస్‌లో కూడా భారీగా కలెక్షన్లను సాధిస్తుండటం విశేషంగా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల నుంచి
అయితే బింబిసారకు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల నుంచి రోజు రోజుకు వసూళ్ల వేగం పెరుగుతున్నది. సోమవారం రోజున తెలుగు రాష్ట్రాల్లో 1.7 కోట్ల షేర్, దేశవ్యాప్తంగా 2.6 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధికారిక వసూళ్లపై కొద్ది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

లాభం ఎంత సాధించిందంటే?
బింబిసార సినిమా విడుదలకు ముందు 15.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా 16.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. గత మూడు రోజుల్లోనే ఈ చిత్రం 18.29 కోట్ల షేర్ సాధించింది. ఇప్పటికే ఈ చిత్రం 2 కోట్లకుపైగా లాభాన్ని నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











