దుమ్ము రేపుతున్న ఎంఎల్ఏ.. కలెక్షన్ల కనకవర్షం
నందమూరి కల్యాణ్ రామ్, అందాల తార కాజల్ అగర్వాల్ నటించిన ఎంఎల్ఏ చిత్రానికి కలెక్షన్లపరంగా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తున్నది. మార్చి 23న రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పటికే లాభాల్లోకి చేరుకొన్నది. ఈ చిత్రంపై సమీక్షలు, టాక్ డివైడ్‌గా ఉన్నప్పటికీ, వాటిని ఎదురించి భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను మార్చి 26న హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు కిరణ్ రెడ్డి, భరత్ చౌదరీ తదితరులు తమ సంతోషాన్ని మీడియాతో పంచుకొన్నారు.
ఎంఎమ్ఎల్ చిత్రం విడుదలైన తర్వాత రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.1.43 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లను పరిశీలిస్తే 8.25 కోట్లు, నికరంగా రూ.7.1 కోట్లు సాధించినట్టు ట్రేడ్ అనలిస్టులు వెల్లడిస్తున్నారు. శుక్ర, శనివారాల కలెక్షన్లతో పోల్చుకొంటే దాదాపు రెండు రెట్లు పెరిగినట్టు నిర్మాతలు వెల్లడించారు.

ఎంఎల్ఏ చిత్ర బడ్జెట్ సుమారు రూ.12 కోట్లుగా పేర్కొంటున్నారు. దాదాపు తాము పెట్టిన పెట్టుబడి ఆదివారం నాటికే వచ్చేసింది. ఇక ముందు వచ్చేదంతా లాభాలే అని నిర్మాతలు వెల్లడించడం గమనార్హం. ఇజం తర్వాత కల్యాణ్ రామ్‌కు మంచి వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.


Click it and Unblock the Notifications











