కళ్యాణ్ రామ్ 'పటాస్‌' పేలే దెప్పుడు?

By Srikanya

హైదరాబాద్: నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'పటాస్‌'. శ్రుతి సోడి హీరోయిన్. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ తుదిదశకు చేరుకొంది. డిసెంబరు మొదటి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ''యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. కథలో వినోదానికీ చోటుంది. భారీ హంగులతో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరిస్తుంది'' అన్నారు. శ్రుతి సోధి పంజాబీ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొంది శ్రుతి. అటు అందంగా కనిపించడంతోపాటు ఇటు నటనలోనూ రాణిస్తోంది. చిత్రంలో కల్యాణ్‌రామ్‌ పోలీసు అధికారిగా కనిపిస్తారు. కథలో మలుపులు రక్తికట్టించేలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది.

కందిరీగ, ఆగడు సినిమాలకు రైటర్‌ గా పనిచేసిన అనిల్‌ రవిపూడి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పటాస్‌ అనేదే మాస్‌ టైటిల్‌, అలాంటి ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ లో కళ్యాణ్‌ రామ్‌ ఫూర్తి రఫ్‌ లుక్‌ లోకనిపించనున్నారు. కళ్యాణ్‌ రామ్‌ నిర్నిస్తున్న ఈ సినిమాకి సాయి కార్తీక్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

Kalyan Ram's Patas in December First Week

చిత్రంలో సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.చిత్రానికి ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి, సంగీతం: సాయికార్తీక్‌, కూర్పు: తమ్మిరాజు, కళ: ఎమ్‌.కిరణ్‌కుమార్‌

ఈ సినిమాతో పాటు నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం షేర్. కత్తి ఫేమ్ మల్లిఖార్జున్ దర్శకుడు. విజయలక్ష్మి పిక్చర్స్ పతాకంపై సాయినిహారిక సమర్పణలో కొమర వెంకటేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆ మధ్యన హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ సరసన 2012 మిస్ ఇండియా వరల్డ్‌గా ఎంపికైన చంఢీఘడ్ భామ వన్య మిశ్రాను ఎంపిక చేశారని తెలిసింది. ఈ సినిమాలో కథానాయికగా చాలా మందిని పరిశీలించిన చిత్ర వర్గాలు చివరికి వన్య విశ్రా వైపు మొగ్గుచూపారని చిత్ర వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X