Thug Life Day 1 Collections: థగ్ లైఫ్ డే1 కలెక్షన్లు, ఆ ఎఫెక్ట్స్ పడిందా? ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'థగ్ లైఫ్'. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. 1987లో వచ్చిన నాయకన్ చిత్రం తర్వాత మళ్లీ 37 ఏళ్లకు ఈ కాంబినేషన్ రిపీట్ కావడం విశేషం. త్రిష కృష్ణన్, శింబు, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రలు పోషించారు. దీంతో ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూన్ 5 కన్నడ మినహా.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఈ సందర్భంగా థగ్ లైఫ్ బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్ డే ఎలాంటి వసూళ్లను రాబట్టింది.. ఇంతకీ మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
థగ్ లైఫ్ మూవీ బడ్జెట్ ఎంత (Thug Life Budget)?
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాను రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించడం విశేషం. కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ నిర్మించారు. ఈ చిత్రంలో భారీ తారాగణం నటించడం, టాప్ టెక్నీషియన్లు, వీఎఫ్ఎక్స్, ప్రత్యేకమైన లోకేషన్లలో షూటింగ్, యాక్షన్ సీన్లు, ప్రమోషన్ల కారణంగా భారీగానే ఖర్చైంది. ఈ సందర్భంగా సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చే వరకు రూ.220 కోట్లు ఖర్చు అయ్యిందని నిపుణులు తెలుపుతున్నారు.

థగ్ లైఫ్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ (Thug Life Break Even Target)?
థగ్ లైఫ్ మూవీకి కమల్ హాసన్ - మణిరత్నం రీయూనైట్ కావడంతోనే అంచనాలు మొదలయ్యాయి. మరోవైపు భారీగా ప్రమోషన్స్ ను నిర్వహించడంతో ఈ చిత్రానికి మార్కెట్ లో డిమాండ్ పెరిగింది. దీంతో సినిమాకు శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా రూ.210 కోట్లు వసూలైంది. ఇక థియేట్రికల్ రైట్స్, ఇతరాత్ర కలుపుకొని మొత్తం రూ.250 కోట్లకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు.
థగ్ లైఫ్ ఓవర్సీస్ కలెక్షన్లు (Thug Life Overseas Collections)
థగ్ లైఫ్ చిత్రానికి ఓవర్సీస్ లోనూ మంచి డిమాండ్ ఉంది. కమల్ హాసన్ సినిమా కావడంతో ఓపెనింగ్ డే మంచి వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు ఓవర్సీస్ లో 50 వేల డాలర్లను రాబట్ట గలిగింది. యూకే, యూఎస్ లో ఈ చిత్రం హవా నెక్ట్స్ లెవల్లో ఉంది. మున్ముందు మంచి వసూళ్లను అందుకోనుంది.
థగ్ లైఫ్ 1వ రోజు బాక్సాఫీస్ వసూళ్లు (Thug Life Day1 Box Office Collections)
థగ్ లైఫ్ మొదటి రోజు బాక్సాఫీస్ వసూళ్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి. అన్ని వివాదాల మధ్య కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు అందాయి. ఈ చిత్రాన్ని ఇండియాలో సుమారుగా 2300 స్క్రీన్లలో, ఓవర్సీస్‌లో సుమారుగా 4000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మొత్తంగా వరల్డ్ వైడ్ 6000 స్క్రీన్లకుపైగా రిలీజ్ జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలో థగ్ లైఫ్ మొదటి రోజు రూ.17 కోట్ల వరకు ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ తెలియజేసింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్ల వరకు వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక తమిళంలో రూ.15.4 కోట్ల నెట్, తెలుగు లో రూ.1.5 కోట్ల నెట్, హిందీలో రూ.10 లక్షల నెట్ మాత్రమే వసూళ్లు సాధించింది. అయితే కర్ణాటకలో ఈ చిత్రం విడుదలై ఉంటే.. కాంట్రవర్సీ కాకుండా ఉంటే రూ.50 కోట్ల వరకు ఓపెనింగ్ డే కలెక్ట్ చేసేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











